Attack On MRO: తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోపై దాడి.. స్వల్ప గాయాలు
ABN, Publish Date - Jun 06 , 2025 | 06:13 PM
తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోపై ఓ వ్యక్తి దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఎమ్మార్వో చేతికి గాయమైంది. అంతలో కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందించి.. అతడిని పట్టుకున్నారు.
అమలాపురం, జూన్ 06: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి తాహశీల్దార్ సి. నాగలక్ష్మమ్మపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేసేందుకు యత్నించాడు. ఈ ఘటనలో ఆమె చేతికి స్వల్ప గాయమైంది. అయితే దాడి చేసిన వ్యక్తికి మతి స్థిమితం లేదని స్థానికులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఎమ్మార్వో కార్యాలయంలో తాహశీల్దార్ సి. నాగలక్ష్మమ్మను కలిసేందుకు జోగిరాజుపాలెంకు చెందిన మీసాల సత్యనారాయణ వచ్చారు. ఆ క్రమంలో కార్యాలయంలోనికి వెళ్లి.. తాహశీల్దార్‌పై కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందించారు. దీంతో ఆతడిని వారు పట్టుకొన్నారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకుని.. ఈ దాడికి యత్నించిన వ్యక్తి మీసాల సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ దాడిలో స్వల్ప గాయమైన తాహశీల్దార్ సి. నాగలక్ష్మమ్మ వెంటనే స్థానిక ఆసుపత్రికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. మరోవైపు ఎమ్మార్వో దాడి ఘటనపై జిల్లా కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ స్పందించారు. ఈ దాడి ఘటనపై తాహశీల్దార్‌కు స్వయంగా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రెచ్చిపోయిన కామాంధులు.. బాలికపై సామూహిక అత్యాచారం
బనకచర్లపై ఘాటుగా స్పందించిన మంత్రి ఉత్తమ్
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 06 , 2025 | 06:19 PM