ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Husband Catches Wife: ప్రియుడితో ఇంట్లో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

ABN, Publish Date - May 13 , 2025 | 12:32 PM

Husband Catches Wife: సోమవారం రాత్రి కూడా రోజూ మాదిరిగ లక్ష్మణ్ చెరువుల దగ్గరికి వెళ్లాడు. అయితే అక్కడ కరెంట్ లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. తీరా అర్ధరాత్రి ఇంటికి వచ్చి చుస్తే ఆ సమయంలో లోపల తన భార్య నాగమణి ప్రియుడు మణికంఠతో ఉంది. తర్వాత ఏం జరిగిందంటే..

Husband Catches Wife

కాకినాడ: భర్త (Husband) ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని (Lover) ఇంటికి పిలిపించు కున్న భార్య (Wife) భాగోతాన్ని భర్త రట్టు చేశాడు. ఇద్దరూ ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా (Red-handed) పట్టుకున్నాడు. వివరాల్లోి వెళితే.. రొయ్యలు, చెరువులు చేస్తున్న భర్త లక్ష్మణ్ రాత్రి వేళల్లో చెరువుల దగ్గరికి వెళ్లి అక్కడే పడుకుంటాడు. కాగా, లక్ష్మణ్ భార్య నాగమణి గతంలో ఒక ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసింది. ఆ క్రమంలో కాలేజీలో చదువుకునే స్టూడెంట్ మణి కంఠ అనే యువకుడితో ఆమె వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది.

Also Read: అండమాన్‌లోకి నైరుతి రుతుపవనాలు..


సోమవారం రాత్రి కూడా రోజూ మాదిరిగ లక్ష్మణ్ చెరువుల దగ్గరికి వెళ్లాడు. అయితే అక్కడ కరెంట్ లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. తీరా అర్ధరాత్రి ఇంటికి వచ్చి చుస్తే ఆ సమయంలో లోపల తన భార్య నాగమణి ప్రియుడు మణికంఠతో ఉంది. దీంతో లక్ష్మణ్ డోర్‌లు మొత్తం లాక్ చేసి పోలీసులకు సమాచారమిచ్చి, చుట్టుపక్కల వాళ్ళను పిలిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘన ప్రదేశానికి చేరుకుని నాగమని, ప్రియుడు మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


మరో ఘటన..

రెండో పెళ్లికి అడ్డుగా ఉందనే ఉద్దేశ్యంతో కర్కశత్వం ప్రదర్శించి కన్నపేగునే చిదిమేసింది ఆ కన్న (కసాయి) తల్లి. అందుకు పూర్తిగా సహకరించింది అమ్మమ్మ. మాతృత్వానికే మాయని మచ్చగా మిగిలిన ఈ సంఘటనలో ఐదు నెలల చిన్నారిని అత్యంత పాశవికంగా పీక నులిమి చంపివేసి పక్కనే ఉన్న నూతిలో పడవేసి, క్షుద్రపూజలు జరిగినట్టు చూపించి హత్యను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగు చూడడంతో చిన్నారిని హత్య చేసిన అమ్మ, అమ్మమ్మలను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం సీఐ జి.శ్రీనివాస్‌, పట్టణ ఎస్‌ఐ మణికుమార్‌ వెల్లడించారు.


అసలేం జరిగిందంటే...

పిఠాపురం పట్టణం జగ్గయ్యచెరువు కాలనీకి చెందిన ఐదు నెలల చిన్నారి యశ్వితను ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత చంపి నూతిలో పడవేశారని నరసింగపురం గ్రామానికి చెందిన పెదపాటి సతీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై హత్య కేసు నమోదు చేసి ఎస్పీ బిందుమాధవ్‌ ఆదేశాల మేరకు కాకినాడ ఏఎస్పీ మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో సాంకేతికపరమైన అంశాలను ఆధారంగా చేసుకుని విచారణ చేపట్టారు. తల్లి, అమ్మమ్మ ఈ హత్యకు చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. చనిపోయిన యశ్విత తల్లి పసుపులేటి శైలజ, పెదపాటి సతీష్‌ ప్రేమించి ఇరు కుటుంబాలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదు నెలల క్రితం పాప (యశ్విత) పుట్టింది. శైలజ వివాహం జరిగిన నాటి నుంచి భర్త తనను అత్తవారింటికి తీసుకువెళ్లకపోవడం, యశ్విత పుట్టినప్పుడు భర్త కుటుంబసభ్యులు, బంధువులు రాకపోవడం, భర్త ముందులా సఖ్యతతో లేకపోవడం శైలజ కొంతకాలంగా ఇబ్బందిగా ఉంది. అదే సమయంలో ముందు నుంచీ అనుకున్న మేనత్త కొడుకుతో కాకుండా ప్రేమించి వివాహం చేసుకోవడం, సతీష్‌కు పుట్టిన యశ్వితను అడ్డు తొలగిస్తే శైలజకు రెండో పెళ్లి చేయవచ్చని అమ్మమ్మ పసుపులేటి అన్నవరం భావించింది. అమ్మ శైలజ, అమ్మమ్మ అన్నవరం కలిసి పథకం ప్రకారం ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి చిన్నారి యశ్విత పీక నొక్కి చంపేసి వాళ్ల ఇంటి వెనుక ఉన్న అడ్డాల కుమారి ఇంటి ఆవరణలో గల బావిలో పడేశారు. అనంతరం చేసిన హత్యను కప్పి పుచ్చుకునేందుకు పాపను ఎవరో మాంత్రికుడు చేతబడి చేసి చంపి ఉంటారని నమ్మించేందుకు ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేసి క్షుద్రపూజలు జరిగినట్టు చూపించారు. అయితే అక్కడ వేసిన పసుపు, కుంకుమ ఇంటిలో నుంచి తెచ్చినట్టు ఉండటం, బావి సమీపంలో అమ్మమ్మ సెల్‌ పడిపోవడం తదితర అంశాల ఆధారంగా కేసు దర్యాప్తు సాగించి పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రప్రదేశ్‌కు రానున్న మరో కీలక ప్రాజెక్టు

మరో కోణంలో ఒత్తిడికి సిద్ధమైన కేంద్రం...

For More AP News and Telugu News

Updated Date - May 13 , 2025 | 12:36 PM