CM Chandrababu: తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jun 30 , 2025 | 08:34 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కొవ్వూరు మండలంలో పర్యటించనున్నారు.
రాజమహేంద్రవరం, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అమరావతిలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10. 00 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు హెలికాఫ్టర్‌లో బయలుదేరనున్నారు. ఉదయం 10.30 గంటలకు కొవ్వూరు మండలం కాపవరం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10.45 గంటలకు మలకపల్లికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. 10.45 నుంచి 11.05 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దే ఆయన నగదు పంపిణీ చేయనున్నారు.
ఉదయం 11.10 గంటలకు గ్రామ సభ వేదికకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. 11.10 నుంచి మ.12.40 వరకు గ్రామ సభలో పాల్గొని లబ్దిదారులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.50 గంటలకు కొవ్వూరు మండలం కాపవరం ఏ.ఎమ్.సికి ఆయన చేరుకుంటారు.
ఆ తర్వాత 1. 30 గంటల నుంచి మ. 3.00 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. 3.40 గంటలకు సీఎం చంద్రబాబు విమానంలో బెంగుళూరు బయలుదేరి వెళ్లనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజాసింగ్‌పై అగ్ర నాయకత్వం సీరియస్
లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..
ముగియనున్న గడువు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫైళ్లు మాయం
Read Latest AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 30 , 2025 | 08:40 PM