ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: గిరిజనుల సమస్య తీరిందన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ABN, Publish Date - May 30 , 2025 | 06:28 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గిరిజన ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గిరిజనులను అభివృద్ధికి చేరువ చేస్తున్నామన్నారు.

Pawan Kalyan

అల్లూరి సీతారామరాజు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుపడి ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు అల్లూరి జిల్లా లక్కవరం నుంచి చీడిగొండ వరకూ రహదారిని నిర్మించినట్లు పవన్ తెలిపారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఎన్నికల హామీ మేరకు లక్కవరం నుంచి చీడిగొండ వరకూ రూ.87.19 లక్షల వ్యయంతో 1.01కి.మీ. రహదారిని నిర్మించినట్లు ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.


గిరిజన గ్రామాలు, PVTG ప్రాంతాలకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం చేపట్టిన PMJANMAN పథకంలో భాగంగా ఈ రహదారిని నిర్మించినట్లు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా దాదాపు 183 మంది గిరిజనులకు రహదారి సమస్య పరిష్కారం అయ్యిందని పవన్ వెల్లడించారు.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గిరిజన ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని పవన్ చెప్పారు. అందులో భాగంగా రూ.1000 కోట్ల నిధులతో అడవి తల్లి బాట కార్యక్రమం చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ గిరిజనులను అభివృద్ధికి చేరువ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.


Also Read:

ఏపీ మెగా డీఎస్సీ.. హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

ఏపీలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి

For More Telugu News

Updated Date - May 30 , 2025 | 07:09 PM