ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

cyber crime: సిమ్‌ బ్లాక్‌ చేసి 1.73 లక్షలు కాజేసి

ABN, Publish Date - Jun 23 , 2025 | 03:32 AM

కూలి పనులు చేసుకునే మహిళ ఖాతా నుంచి సైబర్‌ నేరగా ళ్లు రూ.1,73,001 కాజేశారు. తొలుత సిమ్‌ కార్డును బ్లాక్‌ చేసి.. ఆపై ఆమె ఖాతాలో ఉన్న సొమ్మంతా ఊడ్చేశారు.

  • కర్నూలులో మహిళ ఖాతాను ఊడ్చేసిన సైబర్‌ నేరగాళ్లు

దేవనకొండ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): కూలి పనులు చేసుకునే మహిళ ఖాతా నుంచి సైబర్‌ నేరగా ళ్లు రూ.1,73,001 కాజేశారు. తొలుత సిమ్‌ కార్డును బ్లాక్‌ చేసి.. ఆపై ఆమె ఖాతాలో ఉన్న సొమ్మంతా ఊడ్చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి.కోటకొండకు చెందిన కంచి మహేశ్వరి, గోవిందు దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పనుల నిమిత్తం కర్ణాటకలోని బళ్లారికి వలస వెళ్లారు. మహేశ్వరికి పి.కోటకొండలో ‘ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు’లో ఖాతా ఉంది. దీన్నే ఫోన్‌పేకి లింక్‌ చేసుకున్నారు. ఈ నెల 16న మహేశ్వరి సిమ్‌ ఉన్నట్టుండి బ్లాక్‌ అయింది. దీంతో ఈ నెల 18న అదే నంబరుపై కోడుమూరులో మరో సిమ్‌ తీసుకున్నారు.

ఈ నెల 20న ఇన్సూరెన్సు డబ్బులు రూ.299 కట్‌ అయినట్లు బ్యాంకు నుంచి సందేశం వచ్చింది. అందులో బ్యాలెన్స్‌ రూ.13 మాత్రమే చూపడంతో ఫోన్‌పేలో చెక్‌ చేసి... డబ్బులు మాయమైనట్లు గుర్తించారు. ఈ నెల 21న బ్యాంకు నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారుట. రెండు రోజు ల్లో ఐదుసార్లు మొత్తం రూ. 1,73 ,001 తీసుకున్నట్టు తేలింది. దీంతో బాధిత మహిళ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు ను సైబర్‌ పోలీసులకు బదిలీ చేశామని దేవనకొండ పోలీసులు తెలిపారు.

Updated Date - Jun 23 , 2025 | 03:32 AM