ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jetwani Case Twist: జెత్వానీ కేసులో పీఎస్‌ఆర్‌కు నో బెయిల్‌

ABN, Publish Date - May 10 , 2025 | 04:14 AM

జెత్వానీ కేసులో ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులకు విజయవాడ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. మరోవైపు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ బెయిల్‌పై తీర్పు ఈ నెల 13కి వాయిదా వేసింది

విజయవాడ, మే 9(ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులుకు విజయవాడ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. కాదంబరి జెత్వానీపై అక్రమంగా కేసు నమోదు చేయించిన కేసులో పీఎ్‌సఆర్‌ అరెస్టయి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు, కిడ్నాప్‌ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ మూడోసారి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. న్యాయాధికారి తీర్పును ఈ నెల 13కి రిజర్వు చేశారు.

Updated Date - May 10 , 2025 | 04:14 AM