ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada: మద్యం కేసు నిందితులకు బెయిల్‌పై తీర్పు వాయిదా

ABN, Publish Date - Jun 26 , 2025 | 06:07 AM

మద్యం కుంభకోణం కేసులో మాజీ ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై తీర్పును జూలై 2కు వాయిదా వేస్తూ ఏసీబీ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు.

విజయవాడ, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో మాజీ ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై తీర్పును జూలై 2కు వాయిదా వేస్తూ ఏసీబీ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. మరో నిందితుడు పైలా దిలీప్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు గురువారానికి వాయిదా పడ్డాయి. ఇక జైలులో తనకు ఇంటి నుంచి భోజనం అనుమతించాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును శుక్రవారానికి ఏసీబీ కోర్టు రిజర్వ్‌ చేసింది. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు, మధ్యంతర బెయిల్‌ పిటిషన్లపై విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్‌ నాయుడును కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ గురువారానికి వాయిదా పడింది.

Updated Date - Jun 26 , 2025 | 06:07 AM