ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Coastal Andhra Weather: కోస్తాలో ఠారెత్తించిన ఎండ

ABN, Publish Date - Jun 08 , 2025 | 03:37 AM

రుతుపవనాలు మందగించడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోవడంతో కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం కొన్నిచోట్ల వడగాడ్పులు వీచాయి.

  • నేడు అక్కడక్కడా పిడుగులతో వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): రుతుపవనాలు మందగించడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోవడంతో కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం కొన్నిచోట్ల వడగాడ్పులు వీచాయి. వరుసగా నాలుగోరోజు కోస్తాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కావలిలో 41.1, గన్నవరంలో 41, నెల్లూరులో 40.8, అమరావతిలో 40.7, బాపట్లలో 40.5, ఒంగోలులో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో ఆదివారం ఉక్కపోతతో పాటు40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో ఎండ వేడి కొనసాగుతుందని, కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి, కాకినాడ, ప్రకాశం, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

Updated Date - Jun 08 , 2025 | 03:40 AM