Kuppam: రేపు కుప్పం రానున్న చంద్రబాబు
ABN, Publish Date - May 20 , 2025 | 06:41 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు మే 21న తన నియోజకవర్గం కుప్పంలో జరిగే గంగజాతరలో గంగమ్మ దర్శనానికి హాజరవుతారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
గంగమ్మను దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
కుప్పం, మే 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 21న తన సొంత నియోజకవర్గం కుప్పం రానున్నారు. ఇక్కడ జరుగుతున్న గంగజాతరలో భాగంగా ఆ రోజున జరిగే గంగమ్మ విశ్వరూప దర్శనంలో అమ్మవారిని చంద్రబాబు దర్శించుకుంటారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చి.. 2.30 గంటలకు తిరిగి ప్రయాణమయ్యేలా షెడ్యూల్ ఖరారైంది.
Updated Date - May 20 , 2025 | 06:42 AM