P Narayana: అనంతవరంలో వన మహోత్సం.. హాజరు కానున్న సీఎం, డిప్యూటీ సీఎం
ABN, Publish Date - Jun 04 , 2025 | 09:00 PM
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనంతవరంలో పర్యటించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ పర్యవేక్షించారు.
అమరావతి, జూన్ 04: ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో గురువారం రాజధాని అమరావతిలోని అనంతవరంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఈ వన మహోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్‌తో కలిసి అనంతవరంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్బంగా అందుకు సంబంధించిన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం మంత్రి పి నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా అమరావతి ఉండాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడైనా నిర్మాణాలకు 10 శాతం బ్లూ అండ్ గ్రీన్ ఉంటుంది.. కానీ అమరావతిలో 30 శాతం బ్లూ అండ్ గ్రీన్ ఉండేలా నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కనీసం 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
సింగపూర్, జపాన్‌తో సంప్రదించి అక్కడి ఉన్నట్లే మంచి ప్లాంటేషన్ ఉండేలా చూడమని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని గుర్తు చేశారు. ఆ క్రమంలో ఆయా దేశాల్లో శాస్త్రీయంగా ఉండేలా మొక్కలు నాటుతారని వివరించారు. అదే విధానంలో అమరావతిలో సైతం రకరకాల మొక్కలను శాస్త్రీయ విధానంలో నాటేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమర్‌నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు.. కేంద్రం అలర్ట్
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 04 , 2025 | 09:01 PM