ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala Donations: గోవిందుడికి భారీ కానుక

ABN, Publish Date - May 16 , 2025 | 11:46 AM

Tirumala Donations: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. దాదాపు 10 కోట్లు విలువైన బంగారు ఆభరణాలను స్వామికి సమర్పించారు భక్తుడు.

Tirumala Donations

తిరుమల, మే 16: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి (Tirumala Temple) దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండి శ్రీవారిని కనులారా చూసుకుని తరిస్తుంటారు. అలాగే శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. తలనీలాలు సమర్పిస్తుంటారు. కొందరు తమకు తోచినంత స్వామివారికి కానుకలను అందజేస్తుంటారు. గోవిందుడికి భారీగా విరాళాలు ఇస్తుంటారు. శ్రీవారికి భక్తులు నగదు రూపంలో, బంగారం రూపంలో విరాళాలు సమర్పిస్తుంటారు.


తాజాగా ఓ భక్తుడు స్వామి వారికి భారీ విరాళం అందజేశారు. గోయాంక అనే దాత శ్రీవారికి రూ.10 కోట్ల విలువ చేసే ఆభరణాలను సమర్పించారు. శంఖు, చక్రాలు, వరద, కటి హస్తాలను స్వామికి విరాళంగా ఇచ్చారు. ఆలయంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి గోయాంక ఈ విరాళాన్ని అందజేశారు.


అలాగే నిన్న (గురువారం) ఓ ఎన్‌ఆర్‌ఐ కూడా వెంకన్నకు భారీ విరాళం సమర్పించారు. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఆనంద్ మోహన్ భాగవతుల టీటీడీ ట్రస్టులకు కోటి 40 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్, ఎస్వీ విద్యా దాన ట్రస్ట్‌, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్‌, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్‌‌లకు ఈ మొత్తాన్ని ఎన్‌ఆర్‌ఐ విరాళంగా సమర్పించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి విరాళాల చెక్కులను దాత అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ ఆనంద్ మోహన్ భాగవతులను టీటీడీ చైర్మన్ అభినందించారు.


ఇవి కూడా చదవండి

SIT Investigation: రెండో రోజు సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్

Pakistan Occupied Kashmir: పీవోకేలో ఏముందీ.. సొంతమైతే భారత్‌కు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..

Read Latest AP News And Telugu News

Updated Date - May 16 , 2025 | 03:44 PM