ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ

ABN, Publish Date - May 30 , 2025 | 12:30 AM

వేసవి సెలవులు చివరికి చేరుకోవడంతో తిరుమలకొండకు భక్తులు పోటెత్తారు. గురువారం నుంచే ఎటు చూసినా జనం కనిపిస్తున్నారు.

తిరుమలలో హీరోయిన్‌ శ్రియ- శ్రీకాళహస్తిలో సినీ హీరో శ్రీకాంత్‌ కుటుంబీకుల పూజలు

తిరుమల, ఆంధ్రజ్యోతి: వేసవి సెలవులు చివరికి చేరుకోవడంతో తిరుమలకొండకు భక్తులు పోటెత్తారు. గురువారం నుంచే ఎటు చూసినా జనం కనిపిస్తున్నారు. క్యూలలోని సర్వదర్శన భక్తులకు 16 గంటల దర్శన సమయం పడుతోంది. శ్రీవారిపాదాలు, అలిపిరి కాలినడకదారులు సైతం రద్దీగా మారాయి.

తిరుమలలో హీరోయిన్‌ శ్రియ

గురువారం వేకువజామున సుప్రభాతసేవలో పాలొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల పలువురు అభిమానులు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని, శ్రీకాళహస్తీశ్వరుడిని కూడా శ్రియ దర్శించుకున్నారు.

హీరో శ్రీకాంత్‌ కుటుంబీకుల నవగ్రహ శాంతిపూజలు

శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి: శ్రీకాళహస్తి పట్టణం సన్నిధివీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో హీరో శ్రీకాంత్‌ కుటుంబ సమేతంగా గురువారం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. కాగా, ముక్కంటి ఆలయంలో పనిచేసేకొందరు అర్చకులు, పండితులు శ్రీకాంత్‌కు ప్రైవేటు పూజలు నిర్వహించడం, ఆ ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది.

Updated Date - May 30 , 2025 | 12:30 AM