ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Railway: సిబ్బంది లేకుంటే గస్తీ ఎలా?

ABN, Publish Date - Jun 30 , 2025 | 02:05 AM

ప్రతి ఆరు బోగీలకు ఇద్దరు జీఆర్పీఎఫ్‌, ఆర్పీఎఫ్‌ సిబ్బంది భద్రతా విధుల్లో ఉండాలి. కానీ, 24 బోగీలకు కలిపి కేవలం ఇద్దరే ఉంటున్నారు. - రైల్వేలో గస్తీ సిబ్బంది కొరతకు ఇదే నిదర్శనం. ఇది రైళ్లలో చోరీలు, దోపిడీలపై ప్రభావం చూపుతోంది.

పెరుగుతున్న చోరీలు, దోపిడీలు

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ఇటీవల రైళ్లలో చోరీలు, దోపిడీలు పెరిగాయి. చిత్తూరు రూరల్‌ మండలం సిద్దంపల్లి రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ నెల 26వ తేది తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో రైల్వే సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసి ఎక్స్‌ప్రెస్‌ రైలులో దోపిడీ చేశారు. రెండు బోగీల్లోకి చొరబడిన దుండగులు నలుగురు ప్రయాణికుల నుంచి 70 గ్రాముల బంగారు నగలు కాజేశారు. మే 2న చంద్రగిరి మండలం ముంగిలిపట్టు రైల్వే స్టేషన్‌ పరిధిలో హోమ్‌ సిగ్నల్‌ వ్యవస్థ ట్యాంపరింగ్‌కు గురైంది. రెడ్‌ లైటు వెలుగుతుండడంతో రైలు ఆగింది. ఇంతలోనే దుండగులు బోగీలోకి దూరి ఇద్దరు మహిళల మెడల్లో బంగారు గొలుసులు లాక్కెళ్లారు. తాజాగా శనివారం అర్ధరాత్రి విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద దుండగులు చోరీకి యత్నించారు. ఇలా ఇటీవల రైళ్లల్లో చోరీలు, దోపిడీలు పెరుగుతున్నాయి. దాదాపు ఒకే తరహాలో దుండగులు దోపిడీకి పాల్పడుతున్నారు. గస్తీ సిబ్బంది తగు సంఖ్యలో లేకపోవడంతోనూ ఈ ఘటనలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే.. రైల్లో గస్తీ నిర్వహించే పోలీసులు.. బోగీల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే విచారించాలి. అదుపులోకి తీసుకోవాలి. కానీ రైలుకంతా కలిపి ఇద్దరే ఉంటున్నారు. దీంతో వీరు పూర్తిస్థాయిలో గస్తీపై దృష్టి పెట్టలేకున్నట్లు సమాచారం. గత 20 సంవత్సరాలుగా పదవీ విరమణతో ఖాళీ అవుతున్న స్థానాలు భర్తీ కావడం లేదని, సివిల్‌ పోలీసు నుంచి డిప్యుటేషన్‌పై రైల్వే శాఖకు రావడానికి చాలామంది అయిష్టత చూపుతున్నారని తెలుస్తోంది.

తిరుపతి సబ్‌ డివిజన్‌లో..

ప్రధానంగా తిరుపతి సబ్‌ డివిజన్‌ పరిధిలో ఏఎస్‌ఐలు ఒకరంటే ఒకరు కూడా లేరు. నలుగురు ఎస్‌ఐలకుగాను ఇద్దరే ఉన్నారు. ఇక 10 మంది హెడ్‌ కానిస్టేబుళ్లకు గాను సివిల్‌ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ముగ్గురే పనిచేస్తున్నారు. 49 మంది కానిస్టేబుళ్లు ఉండాల్సి ఉండగా, పనిచేసేది పది మందే. వీరికి కోర్టు డ్యూటీలు, సమన్లు ఇవ్వడం, శవ పంచనామాలు నిర్వహించడం వంటి ఇతరత్రా డ్యూటీలూ ఉన్నాయి. దీంతో రైళ్లలో విధులు నిర్వహించడానికి అవసరమైన సిబ్బంది లేకుండా పోయారు. దీంతో దుండగులు సిగ్నల్‌ వ్యవస్థలు ట్యాంపరింగ్‌ చేయడం, రైళ్లలో ప్రయాణికుల్లా ప్రయాణించి దోపిడీలకు పాల్పడుతున్నారు.

ప్రయాణికుల భద్రతకు పెద్దపీట: ఆశీర్వాదం, రైల్వే జీఆర్పీఎఫ్‌ సీఐ, తిరుపతి

రైల్వే శాఖలో సిబ్బంది కొరత వాస్తవమే. అయితే తిరుపతి సబ్‌ డివిజన్‌ పరిధిలో డీఎస్పీ ఆధ్వర్యంలో ఉన్న సిబ్బందితో ప్రయాణికుల భద్రత ధ్యేయంగా గట్టిగా బందోబస్తు చేస్తున్నాం. ఇటీవల రైలు దోపిడీలు, చోరీలను సవాల్‌గా తీసుకుని మరింత పకడ్బందీగా పని చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. రాత్రి పూట అన్ని బోగీలు తనిఖీ చేసి నివేదికలు తెప్పించుకుంటున్నాం. అనుమానితుల వేలిముద్రలు సేకరించే పని ముమ్మరం చేస్తున్నాం.

Updated Date - Jun 30 , 2025 | 02:05 AM