Teacher: ఉపాధ్యాయ ఖాళీలపై కసరత్తు
ABN, Publish Date - May 11 , 2025 | 01:19 AM
విద్యాశాఖలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన త్వరలోనే పెద్దఎత్తున బదిలీలు, పదోన్నతులు జరగనున్నాయి.
త్వరలో బదిలీలు, ఆపై పదోన్నతులు
చిత్తూరు సెంట్రల్, మే 10 (ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన త్వరలోనే పెద్దఎత్తున బదిలీలు, పదోన్నతులు జరగనున్నాయి. ఏ ఒక్క పోస్టూ బ్లాక్ చేయకుండా వీటిని చేపట్టే దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. నాలుగు నెలలుగా సాగుతున్న టీచర్ల సీనియారిటీ జాబితా, ఖాళీల గుర్తింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో శనివారం విద్యాశాఖలో క్లియర్ వేకెన్సీలు చూపేందుకు అధికారులు చిత్తూరు ప్రభుత్వ పాఠశాలలో సమావేశమై కసరత్తు జరిపారు. చిత్తూరు డీఈవో వరలక్ష్మి ఆధ్వర్యంలో తిరుపతి డీఈవో కేవీఎన్ కుమార్, అన్నమయ్య జిల్లా డీవైఈవో లోకేశ్వర రెడ్డి, చిత్తూరు డీవైఈవో ఇందిర, ఏడీ వెంకటేశ్వరరావు ఈ ప్రక్రియను పర్యవేక్షించగా 66మంది ఎంఈవోలు, హెచ్‌ఎంలు ప్రక్రియలో పాలుపంచుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,918 ఖాళీలుండగా, మరో నాలుగు వేల ఖాళీలు చూపే అవకాశం ఉంది. బదిలీలు,ఆపై పదోన్నతులు, మిగిలిన ఖాళీలకు తాజాగా డీఎస్సీ ద్వారా వచ్చే ఉపాధ్యాయులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. క్లియర్ వేకెన్సీ వివరాల ఆధారంగా తొలుత బదిలీలు చేపడతారు. ఆపై 1:2 విధానంలో పదోన్నతుల జాబితా విడుదల చేయనున్నారు.
బదిలీల ప్రక్రియలో చూపే ఖాళీల వివరాలు
బదిలీ ప్రక్రియలో భాగంగా క్లియర్ వేకెన్సీలను చూపేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పాఠశాల, మండల, డివిజన్, జిల్లాస్థాయుల్లో క్యాడర్లవారీగా ఖాళీలను గుర్తిస్తున్నారు. మరణించిన,వీఆర్‌ఎస్ తీసుకున్న,రిటైరైన ఉపాధ్యాయులతో ఏర్పడిన ఖాళీలు, ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హెచ్‌ఎం స్థానాలు, 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న టీచర్ల స్థానాలు, స్టడీ సెలవులపై వెళ్ళిన ఖాళీలు, పోక్సో కేసుల్లో వెళ్లిన వారి స్థానాలను క్లియర్ వేకెన్సీలుగా చూపనున్నారు.
ప్రస్తుత ఖాళీల వివరాలు
యాజమాన్యం మంజూరైన పోస్టులు పనిచేస్తున్న టీచర్లు ఖాళీలు
ప్రభుత్వ 723 598 125
ఎంపీ/జడ్పీ 15,552 13,969 1583
మున్సిపల్ కార్పొరేషన్ 589 454 135
మున్సిపాలిటీ 508 433 75
17,372 15,454 1918
క్యాడర్ వారీగా ఖాళీలు
విద్యాశాఖలో 37 కేడర్లలో టీచర్లు పనిచేస్తున్నారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జరగక ముందే వివిధ క్యాడర్లలో 1981 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు.గ్రేడ్-2 హెచ్‌ఎం 90 ఖాళీలు, స్కూల్ అసిస్టెంట్(మ్యాథ్స్)- తెలుగు 28, ఉర్దూ 1, తమిళం 1, ఎస్‌ఏ(ఫిజిక్స్) తెలుగు 25, తమిళం 1, ఎస్‌ఏ(బయాలజీ) తెలుగు 63, ఉర్దూ 1, తమిళం 3, ఎస్‌ఏ(సోషల్)తెలుగు 103, ఉర్దూ 5, తమిళం 5, ఎస్‌ఏ-ఇంగ్లీష్ 96, తెలుగు 53, హిందీ 27, ఉర్దూ 14, సంస్కృతం 3, ల్యాంగ్వేజ్ పండిట్లు-తెలుగు 2, హిందీ 3, ఉర్దూ 1, తమిళం 1, ఎస్‌ఏ-స్పెషల్ ఎడ్యుకేషన్ 13, ఫిజికల్ ఎడ్యుకేషన్ 93, పీఈటీ 25, క్రాఫ్టు 3, డ్రాయింగ్ 16, మ్యూజిక్ 5, ఒకేషనల్ 16, పీఎ్‌స-హెచ్‌ఎం తెలుగు 75, ఉర్దూ 1, తమిళం 1, సెకండరీ గ్రేడ్ టీచర్లు- తెలుగు 1039, ఉర్దూ 97, తమిళం 8 ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్లయితే మరో నాలుగు వేల ఖాళీలు చూపనున్నారు.
Updated Date - May 11 , 2025 | 01:19 AM