ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhanuprakash Reddy: గోశాల నుంచి గోవిందుడి వరకు వైసీపీ అబద్ధపు ప్రచారం

ABN, Publish Date - Jun 01 , 2025 | 12:30 PM

తిరుమలలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ నేత, టీటీడీ సభ్యులు భాను ప్రకాశ్ యాదవ్ మండిపడ్డారు. గోశాల నుంచి గోవిందుడి వరకు అంతా అబద్దపు ప్రచారాన్ని వైసీపీ చేస్తుందని ఆరోపించారు.

TTD Member Bhanuprakash Reddy

తిరుమల, జూన్ 01: తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని ఆ బోర్డు పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ఖండించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదివారం ఆయన లేఖ రాశారు. గోశాల నుంచి గోవిందుడి వరకు అబద్ధపు ప్రచారం చేస్తోందంటూ వైసీపీపై ఆయన మండిపడ్డారు. తిరుమలలో జరుగుతున్న వరుస ఘటనలు వెనుక వైసీపీ కట్ర కోణం ఉందని ఆయన ఆరోపించారు. తిరుమల ప్రతిష్టను దిగజార్చే విధంగా కుట్రలు చేస్తున్న వైసీపీ నేతలపై పోలీస్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.


ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజాగా శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో ఉన్న కాకినాడకు చెందిన ఓ భక్తుడు.. టీటీడీ చైర్మన్, ఈవోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై టీటీడీ విచారణ జరిపింది. అందులోభాగంగా సదరు భక్తుడుని విచారించింది. ఈ సందర్భంగా టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. అంతేకాకుండా..టీటీడీని సదరు భక్తుడు క్షమాపణలు కోరాడు.


అయితే ఈ వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో పలువురు భక్తులకు ఆ ప్రాంతంలోని వారు కీలక సూచనలు చేశారు. అవి సైతం సదరు వీడియోలో క్లియర్ కట్‌గా రికార్డు అయ్యాయి. ఈ వీడియోను నిశీతంగా పరిశీలిస్తే.. వైసీపీ వారే ఈ వీడియోను చిత్రీకరించారనే ఓ చర్చ సాగుతుంది. అలాంటి వేళ.. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి పై విధంగా స్పందించారు. అదీకాక.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో జంతు అవశేషాలు వినియోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. మరికొద్ది రోజుల్లో అందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఇంత త్వరగా పాకిస్థాన్‌తో ఎందుకు ఒప్పందం చేసుకున్నట్లు..

మావోయిస్టుల కుట్రను భగ్రం చేసిన భద్రతా బలగాలు

For Andhrapradesh News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 12:31 PM