Elephant: పంటలపై ఆగని ఒంటరి ఏనుగు దాడి
ABN, Publish Date - Apr 21 , 2025 | 01:01 AM
పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడి కొనసాగుతూనే ఉంది.
మామిడి కొమ్మలు విరిచి కాయలను నేలరాల్చిన ఒంటరి ఏనుగు
కల్లూరు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడి కొనసాగుతూనే ఉంది. పాళెం పంచాయతీ సమీపంలోని తూర్పు విభాగం అటవీ ప్రాంతం నుంచి శనివారం రాత్రి ఒంటరి ఏనుగు జూపల్లె చేరుకుంది. గ్రామంలోని రైతు మల్లికార్జునకు చెందిన మామిడిచెట్టు కొమ్మలను విరిచేసింది, కాయలను నేలరాల్చింది. ఇదే తోటలో కలియతిరిగి అడవిలోకి తిరుగుముఖం పట్టింది. ఈ మార్గంలోని పలువురు రైతుల మామిడిచెట్లను విరుచుకుంటూ అడవిలోకి చేరుకున్నట్లు స్థానిక రైతులు తెలిపారు. ఆదివారం పగలంతా అడవిలోని దిగువచలం, దుగ్గోనిపెంట ప్రాంతాల్లో ఒంటరి ఏనుగు తిష్ఠ వేసినట్లు ఎఫ్‌ఎ్‌సవో మహమ్మద్ షఫి తెలిపారు.
Updated Date - Apr 21 , 2025 | 01:01 AM