ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nimmala Ramanayudu: కరువు రహిత రాష్ట్రమే చంద్రబాబు లక్ష్యం

ABN, Publish Date - Jul 10 , 2025 | 05:18 AM

ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి. రిజర్వాయర్లలో నిల్వ చేసుకోవాలి వర్షాలు లేని సమయంలో వాటిని వాడుకోవాలి.

పట్టిసీమకు 1,300 కోట్లు ఖర్చు పెట్టి 50 వేల కోట్లు ఆదాయం సంపాదించాం: మంత్రి నిమ్మల

  • పవిత్ర సంగమం వద్ద జలహారతి ఇచ్చిన నేతలు

ఇబ్రహీంపట్నం, జూలై 9(ఆంధ్రజ్యోతి): ‘ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి. రిజర్వాయర్లలో నిల్వ చేసుకోవాలి. వర్షాలు లేని సమయంలో వాటిని వాడుకోవాలి. కరువు రహిత రాష్ట్రంగా ఏపీనీ తీర్చిదిద్దాలి. అదే సీఎం చంద్రబాబు లక్ష్యం. దేశంలోనే తొలి సారిగా రాష్ట్రంలో గోదావరి - కృష్ణా నదులను అనుసంధానం చేసిన అపర భగీరథుడు ఆయన’ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద పట్టిసీమ ద్వారా పోలవరం కాలువలో వచ్చి కృష్ణా నదిలో కలిసిన గోదావరి జలాలకు ఆయన జలహారతులిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘జాతి సంపదైన శ్రీశైలాన్ని కాపాడుకోవాలి. పట్టిసీమ ద్వారా గోదావరిలో కలిసే వరద జలాలను కృష్ణాలో కలిపి డెల్టాలోని 13 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఏడాది జూలైలో అర టీఎమ్‌సీ సాగునీరు నిల్వ ఉంటే ఈ ఏడాది అదే జూలైలో 20 టీఎమ్‌సీల నీరు నిల్వ ఉంది. వాటర్‌ మేనేజ్‌మెంట్‌లో గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి. వైసీపీ హాయాంలో పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు తుడిచి పెట్టుకుపోయింది. 20 గ్రామాలను వరద ముంచెత్తింది. 42 మంది మరణానికి కారణమైంది. పట్టిసీమతో పాటు రాష్ట్రంలోని 1,040 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో సగం మూతపడేలా చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందకుండా చేసింది. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులకు కనీసం గ్రీజు కూడ పెట్టలేదు.

ఐదేళ్లలో వైసీపీ రూ.100 కోట్లు సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం ఈ ఏడాది రూ.700 కోట్ల నిధులు మంజూరు చేసింది. శ్రీశైలం, ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్‌, ఇతర సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు, గేట్ల మార్పిడికి టెండర్లు పిలుస్తోంది. పట్టిసీమ నుంచి 2014-19 మధ్య 263 టీఎమ్‌సీల సాగునీరు కృష్ణాలో కలిపాం. శ్రీశైలం పూర్తి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ. తద్వారా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ను రాయలసీమకు మళ్లించుకోగలిగాం. శ్రీశైలంలో 90 నుంచి 95 శాతం నీటిని నిల్వ చేసుకోగలిగామంటే అది పట్టి సీమ ద్వారానే సాధ్యమైంది. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 428 టీఎమ్‌సీలకు పైగా కృష్ణా డెల్టాకు తరలించాం. ఇది నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ. పట్టిసీమకు రూ.1,300 కోట్లు ఖర్చు చేసి రూ.50 వేల కోట్ల ఆదాయాన్ని సంపాదించుకోగలిగాం’ అని మంత్రి వివరించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్‌ రాజగోపాల్‌, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ చెన్నుబోయిన చిట్టిబాబు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మిశ, ఇరిగేషన్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 05:18 AM