ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: చంద్రబాబు దక్షతతో అభివృద్ధిలో అగ్రగామిగా ఏపీ

ABN, Publish Date - Jun 24 , 2025 | 06:05 AM

దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

  • రాష్ట్రాభివృద్ధికి రథసారధులుగా బాబు, పవన్‌

  • ప్రజల సేవకు ఎన్డీయే కట్టుబడి ఉంది: పురందేశ్వ

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని సోమవారం అమరావతిలో ఏర్పాటు చేసిన సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నరకాసుర వధ జరిగాక దీపావళి పండుగ ఎలా జరుపుకుంటామో.. రాష్ట్రంలో విధ్వంస పాలన అంతమై ఏడాదైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదేళ్ల దుష్టపాలన అనంతరం ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. పేదలకు ఆసరా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా అప్పులు ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ లు రథసారధుల్లా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నారన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ ప్రజల పట్ల అంకితభావం చాటుకుంటోందని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర లక్ష్యాలను అందుకునే దిశగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు దూసుకెళ్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ నిర్దేశించిన వికసిత్‌ భారత్‌ లక్ష్యాలను కలిసికట్టుగా అందుకుందామని పిలుపునిచ్చారు.

Updated Date - Jun 24 , 2025 | 06:06 AM