Shivraj Singh chouhan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేంద్రమంత్రి ఫైర్
ABN, Publish Date - Jul 29 , 2025 | 04:38 PM
మంగళవారం నాడు లోక్‌సభలో ఫసల్ బీమా యోజన అమలుపై రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనివాలా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానం ఇచ్చారు. కొన్నిసార్లు రాష్ట్రాలు తమ వాటా ఇవ్వడం లేదన్నారు. మరికొన్ని సార్లు ఆలస్యం చేస్తున్నాయని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, జులై 29: ఆంధ్రప్రదేశ్‌లో గత జగన్ ప్రభుత్వ హయాంలో మూడేళ్లపాటు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు నగదు ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం సకాలంలో నగదు చెల్లించిందని గుర్తు చేశారు. రాష్ట్రాలు సకాలంలో వారి వాటా ఇవ్వకుంటే.. 12 శాతం వడ్డీ కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
మంగళవారం నాడు లోక్‌సభలో ఫసల్ బీమా యోజన అమలుపై రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనివాలా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానం ఇచ్చారు. కొన్నిసార్లు రాష్ట్రాలు తమ వాటా ఇవ్వడం లేదన్నారు. మరికొన్ని సార్లు ఆలస్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం వాటా ప్రకారం రైతులకు వారి ఖాతాల్లో నగదు పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఎడాపెడా అప్పులు..
వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వివిధ పథకాల కింద నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది. ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో కేంద్రం, ఆర్బీఐ నుంచి భారీగా రుణాలు తీసుకువచ్చి ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో పంచిపెట్టింది. వెనకా ముందు ఆలోచించకుండా ఎడాపెడా అప్పులు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దివాళా దిశగా అడుగులు వేసింది. అంతేకాకుండా జగన్ ఐదేళ్ల పాలనలో చివరి మాసాల్లో పలు పథకాల కింద నగదు సైతం చెల్లించకపోవడం గమనార్హం. బటన్ నొక్కినా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు పడకపోవడంతో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సైతం వెల్లువెత్తాయి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడంపై ప్రజలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల
పెన్సిల్ ముల్లుపై వైట్‌హౌస్.. ట్రంప్ ప్రశంసలు
Read latest AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 29 , 2025 | 05:26 PM