Share News

Gattam Venkatesh: పెన్సిల్‌ ముల్లుపై వైట్‌హౌస్‌.. ట్రంప్‌ ప్రశంసలు

ABN , Publish Date - Jul 29 , 2025 | 06:44 AM

పెన్సిల్‌ ముల్లుపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను రూపొందించిన మన కళాకారుడు ట్రంప్‌ మనసు దోచుకున్నారు.

Gattam Venkatesh: పెన్సిల్‌ ముల్లుపై వైట్‌హౌస్‌.. ట్రంప్‌ ప్రశంసలు

నక్కపల్లి, జూలై 28(ఆంధ్రజ్యోతి): పెన్సిల్‌ ముల్లుపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను రూపొందించిన మన కళాకారుడు ట్రంప్‌ మనసు దోచుకున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన గట్టెం వెంకటేశ్‌ ట్రంప్‌ ప్రశంసలు అందుకున్నారు. న్యూ యార్క్‌లో ఆర్కిటెక్‌ ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తున్న గట్టెం వెంకటేష్‌ పెన్సిల్‌ ముల్లుపై 2 సెం.మీ. పొడవు, 1 సెం.మీ. వెడల్పుతో వైట్‌హౌస్‌ను తీర్చిదిద్దారు. ఈ నెల 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఎగ్జిబిషన్‌లో వెంకటేశ్‌ తన కళాఖండాన్ని ప్రదర్శించారు. వెంకటేశ్‌ తయారుచేసిన కళాఖండం గురించి వైట్‌ హౌస్‌ అధికారులు అధ్యక్షుడు ట్రంప్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో వెంకటేశ్‌ను ప్రశంసిస్తూ వైట్‌హౌస్‌ ప్రశంసాపత్రాన్ని విడుదల చేసింది.

Updated Date - Jul 29 , 2025 | 06:46 AM