MLA Prasanna: మాజీ ఎమ్మెల్యే ప్రసన్నపై కేసు
ABN, Publish Date - Jul 10 , 2025 | 04:15 AM
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై కోవూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
4 సెక్షన్లపై కోవూరు స్టేషన్‌లో నమోదు
ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు
కోవూరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై కోవూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం ఆమె ఏఎస్పీ సౌజన్యను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడిన వీడియోలను పరిశీలించిన సీఐ సుధాకరరెడ్డి, ఎస్‌ఐ రంగనాధ్‌గౌడ్ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి ఆయనపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎ్‌స) కింద 74, 75, 79 సెక్షన్లతోపాటు సెక్షన్ 296 వర్తించేలా కేసు నమోదు చేశారు. ఇంకోవైపు.. ప్రసన్న ఇంటిపై జరిగిన దాడిలో టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోవూరు జడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత బుధవారం దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అనుచరులు వంద మంది... చంపాలన్న ఉద్దేశంతోనే ప్రసన్న ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Updated Date - Jul 10 , 2025 | 04:15 AM