BJP Notification: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్
ABN, Publish Date - Jun 30 , 2025 | 03:56 AM
రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్‌ను రిటర్నింగ్ అధికారి పాకా సత్యనారాయణ ఆదివారం విడుదల చేశారు. అధ్యక్షుడి ఎన్నికతో పాటు పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుల...
నేడు నామినేషన్లు.. రేపు అధ్యక్షుడి ప్రకటన
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్‌ను రిటర్నింగ్ అధికారి పాకా సత్యనారాయణ ఆదివారం విడుదల చేశారు. అధ్యక్షుడి ఎన్నికతో పాటు పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుల కోసం సోమవారం ఉదయం 11గంటల నుంచి నామినేషన్లను స్వీకరించి రెండు గంటలకు అర్హమైనవి ప్రకటిస్తారు. సాయంత్రం 4గంటల లోపు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. జూలై 1న సాయంత్రం నూతన రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రకటిస్తామని సత్యనారాయణ తెలిపారు. ఓటర్ల జాబితా విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అందుబాటులో ఉందని, పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లోనూ చూసుకోవచ్చని ఆయన సూచించారు.
Updated Date - Jun 30 , 2025 | 03:57 AM