Duggubati Purandheswari: కండువాతోపాటు బాధ్యతలూ ఉంటాయి
ABN, Publish Date - May 16 , 2025 | 04:31 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దుగ్గుబాటి పురందేశ్వరి ఎన్‌ఆర్‌ఐల కండువా కప్పుకోవడం మాత్రమే కాదు, బాధ్యతలూ ఉండాలని చెప్పారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్న ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు విజయవాడలో పార్టీకి చేరుకున్నారు.
పార్టీలో చేరిన ఎన్‌ఆర్‌ఐలతో పురందేశ్వరి
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): ‘కండువా కప్పుకోవడం కాదు... దాంతో పాటు బాధ్యతలూ ఉంటాయి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దుగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. అమెరికాలో 17 సంవత్సరాలుగా సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తోన్న సుధారెడ్డి, వేమూరు నాగేశ్వరరావు గురువారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఒకప్పుడు అమెరికా అంటే క్రేజ్ ఉండేదని గత పదేళ్లుగా ఇండియాలో జరుగుతోన్న అభివృద్ధి చూస్తుంటే ఇక్కడ ఉండటమే సబబు అనిపిస్తోందని ఎన్‌ఆర్‌ఐలు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతోన్న ‘వన్ నేషన్... వన్ ఎలక్షన్...’ సమావేశాలపై పురందేశ్వరి సమీక్షించారు. ఈ ఎన్నికతో దేశానికి, ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో సమాజానికి వివరించాలని కార్యక్రమ కన్వీనర్ వల్లూరు జయప్రకాశ్ నారాయణకు ఆమె సూచించారు.
నేడు బెజవాడలో తిరంగా ర్యాలీ
భారత సైనికులకు సంఘీభావంగా విజయవాడలో శుక్రవారం నిర్వహించే ర్యాలీలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారని పురందేశ్వరి తెలిపారు. సాయంత్రం 6గంటలకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ప్రారంభమయ్యే ర్యాలీ బెంజ్ సర్కిల్ వరకూ కొనసాగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు.
Updated Date - May 16 , 2025 | 04:33 AM