Biotech Park: ఉత్తరాంధ్రలో బయోటెక్ పార్క్
ABN, Publish Date - Jun 27 , 2025 | 06:51 AM
ఉత్తరాంధ్రలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఫంక్షనింగ్ యూనివర్సిటీతో కూడిన బయోటెక్ పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఏర్పాటుకు అనుమతివ్వండి.. కేంద్రాన్ని కోరిన మంత్రి కొండపల్లి
అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఫంక్షనింగ్ యూనివర్సిటీతో కూడిన బయోటెక్ పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్‌ను కలిసి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ బయోటెక్ పార్కులో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఫంక్షనింగ్ యూనివర్సిటీని స్థాపించడం ద్వారా పరిశ్రమ, పరిశోధన, విద్యార్థుల మధ్య సహకారాన్ని పెంచి, భారతీయ ఆయుర్వేదాన్ని ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి జాదవ్ సానుకూలంగా స్పందించారని మంత్రి కొండపల్లి తెలిపారు.
Updated Date - Jun 27 , 2025 | 06:51 AM