ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhanakacherla project: బనకచర్లకు అనుమతి ఇవ్వలేం.. నిపుణుల కమిటీ

ABN, Publish Date - Jun 30 , 2025 | 08:59 PM

పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత దశలో అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

అమరావతి, జూన్ 30: పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్‌కు ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్‌పై పలు సందేహాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్ట్‌కు ఇప్పుడే అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ వెనక్కి పంపింది. అంతే కాకుండా మూడు కీలక సూచనలు చేసింది.

1. ప్రాజెక్టు ప్రతిపాదకులు (PP) కేంద్ర జల సంఘం (CWC) సహాయంతో వరదనీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలి.

2. Godavari Water Disputes Tribunal Award, 1980కి విరుద్ధంగా ఉందన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలి.

3. TOR తయారీకి ముందు రాష్ట్రాల మధ్య జల పంపిణీపై క్లారిటీ కోసం కేంద్ర జల కమిషన్ అనుమతి తీసుకోవాలి.

సముద్రంలో కలిసే గోదావరి నది మిగుల జలాలను మళ్లించి.. రాయలసీమ జిల్లాలకు అందించాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. అందుకోసం బనకచర్ల ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఏపీ చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తమ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ క్రమంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాయి. పలువురి అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అనంతరం ఈ వ్యవహారంపై కేంద్ర జలశక్తితోపాటు పలు శాఖల మంత్రులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదాహరణగా వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

రాజాసింగ్‌పై అగ్ర నాయకత్వం సీరియస్

ముగియనున్న గడువు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫైళ్లు మాయం

Read Latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 09:57 PM