ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరావుకు కీలక పదవి

ABN, Publish Date - Feb 01 , 2025 | 07:06 PM

AB Venkateswara Rao: రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుకు మళ్లీ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్ అయ్యే ఒక్క రోజు ముందు వైసీపీ ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. దీంతో ఆయన కూటమి కీలక పోస్ట్‌లో నియమించింది.

Retd DGP AB Venkateswara rao

అమరావతి, ఫిబ్రవరి 01: ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏ.బీ. వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ శనివారం జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం.. ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. అందులోభాగంగా ఆయనను రెండుసార్లు సస్పెండ్ చేసింది.

ఒకసారి ఆయన న్యాయస్థానంకు వెళ్లి.. ఊరట పొందారు. మరో సారి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళ్లి ఊరట పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు రిటైర్మంట్ సమయంలో ఆయనకు పోస్టింగ్ సైతం ఇవ్వలేదు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ క్రమంలో రిటైర్మంట్ అయ్యే ఒక్క రోజు ముందు ఆయన పోస్టింగ్ పొందారు. ఆ మరునాడు ఆయన రిటైర్ అయ్యారు.

అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అయితే సస్పెన్షన్‌ సమయంలో రావాల్సిన బకాయిలను సైతం ఏబీ వెంకటేశ్వరరావుకు విడుదల చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు సైతం జారీ చేసింది. తాజాగా ఆయన్ని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషణ్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.

Also Read: : ఇది సీఎం చంద్రబాబు పవర్..


2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్‌‌గా పని చేశారు. 2019 జూన్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అనంతరం ఏబీవీని ఆ పోస్టింగ్‌ నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన ఏరోస్టాట్, యూఏవీ భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సదరు ప్రభుత్వం ఆరోపించింది. ఆ క్రమంలో 2020, ఫిబ్రవరిలో ఆయన్ని సస్పెండ్ చేసింది.

Also Read:: పథకాలకు భారీ కేటాయింపులు.. అవి ఎంతెంత అంటే ?


దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని కోర్టుకు వివరించారు. 2022లో ఆయనపై కోర్టు సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆదేశించింది. దీంతో ఆయన్ని ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్‌గా నియమించిందీ నాటి వైసీపీ ప్రభుత్వం. మళ్లీ 2022 జూన్‌ 28న రెండోసారి ఆయన్ని సస్పెండ్ చేసింది.

Also Read: మళ్లీ ఎన్‌కౌంటర్: భారీగా మావోయిస్టులు హతం

Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ


ఈ సస్పెన్షన్‌ను ఆయన సవాలు చేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడ సైతం ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన పదవీ విరమణకు ఒక రోజు ముందు ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్‌ ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. దీంతో బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటలోనే ఆయన రిటైర్ అయ్యారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 07:06 PM