ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP EAPCET 2025 : ఏపీఈఏపీసెట్‌ ప్రారంభం

ABN, Publish Date - May 20 , 2025 | 06:49 AM

ఏపీఈఏపీసెట్‌-2025 పరీక్షలు జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమయ్యాయి. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలకు 92.03% విద్యార్థులు హాజరయ్యారు.

  • తొలి రోజు అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షకు 37,655 మంది హాజరు

  • 92.03 శాతంహాజరు నమోదు

జేఎన్టీయూకే, మే 19 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏపీఈఏపీసెట్‌-2025 ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్ష ఏపీ, హైదరాబాద్‌లో ప్రశాంతంగా జరిగిందని ఏపీఈఏపీ సెట్‌ చైర్మన్‌, జేఎన్టీయూకే వైస్‌చాన్సలర్‌ సీఎ్‌సఆర్కే ప్రసాద్‌ తెలిపారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్ష సెట్‌ కోడ్‌ను వర్సిటీలోని ఈఏపీసెట్‌ కార్యాలయంలో విడుదల చేసి పరీక్ష నిర్వహణ తీరును కన్వీనర్‌ సుబ్బారావుతో కలిసి పరిశీలించారు. ఉదయం సెషన్‌లో 20,461 మంది విదార్థులకు 18,724 మంది హాజరయ్యారని,. మధ్యాహ్నం 20,456 మంది విదార్థులకు 18,931 మంది హాజరయ్యారని తెలిపారు. మొత్తం రెండు సెషన్లకు కలిపి 92.03 శాతం హాజరు నమోదైందని వీసీ తెలిపారు.

Updated Date - May 20 , 2025 | 06:51 AM