Satya Kumar Health Minister: నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయండి
ABN, Publish Date - Jul 18 , 2025 | 05:32 AM
కల్తీ ఆహార పదార్థాలు, నాణ్యతలేని మందుల సరఫరా.. ఈ రెండు విషయాల్లో నిఘా వ్యవస్థను పటిష్ఠం
కల్తీ ఆహారం, మందుల్ని నివారించండి: మంత్రి సత్యకుమార్
అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): కల్తీ ఆహార పదార్థాలు, నాణ్యతలేని మందుల సరఫరా.. ఈ రెండు విషయాల్లో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశాఖలో ఐపీఎం, డ్రగ్ విభాగాలపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) విభాగాల్లోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ఐపీఎం, డీసీఏ విభాగాలకు దీర్ఘకాలికంగా రెగ్యులర్ విభాగాధిపతులు లేకపోవడంతో ఈ శాఖల పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్నారు. ప్రభుత్వ వైద్య సేవలను మరింత మెరుగుపరచడానికి, వివిధ స్థాయిల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో డిజిటల్ వైద్య సేవల్ని విస్తృతం చేసేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్
Updated Date - Jul 18 , 2025 | 05:32 AM