AP Tech Hub: గ్లోబల్ టెక్ హబ్‌గా ఏపీ
ABN, Publish Date - Jun 03 , 2025 | 04:37 AM
ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి నాస్కామ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. లక్ష మంది నిపుణుల తయారీకి టెక్ అప్రెంటీస్ ప్రోగ్రాం, విశాఖ-తిరుపతిలో ఏఐ డిస్ట్రిక్ట్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
లక్ష మంది నిపుణుల తయారీకి అప్రెంటీస్ ప్రోగ్రాం
నాస్కామ్ ప్రతినిధులతో చంద్రబాబు
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన అంశాలపై నాస్కామ్ ప్రతినిధి బృందంతో సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. 100కే టెక్ అప్రెంటీస్ ప్రోగ్రాం ద్వారా అవసరమైన లక్ష మంది నిపుణులను సమకూర్చుకోవడంపై వారితో సమాలోచనలు జరిపారు. ఈ వివరాలను సీఎం ‘ఎక్స్’లో పంచుకున్నారు. ‘ఆంధ్ర ఫర్ భారత్’ కార్యక్రమంపై నాస్కామ్ ప్రతినిధులతో చర్చించినట్లు పేర్కొన్నారు. సీఎంతో భేటీ అయిన బృందంలో నాస్కామ్ అధ్యక్షుడు రాజేశ్ నంబియార్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ శ్రీనివాసన్ తదితరులు ఉన్నారు. కాగా, విశాఖ, తిరుపతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ట్రిక్ట్ టెస్ట్ బెడ్ ఏర్పాటుకు నాస్కామ్ ప్రతిపాదన చేసింది. భూసంబంధిత అంశాలు, వైద్య ఆరోగ్య, విద్యారంగాల్లో ఓపెన్ ఏఐ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి పౌరసేవలను అందించవచ్చని వెల్లడించింది. గ్రామీణ టెక్ సొల్యూషన్స్‌కు అవకాశం ఉందని పేర్కొంది.
Updated Date - Jun 03 , 2025 | 04:40 AM