ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Aerospace Defense: ఏరోస్పేస్ డిఫెన్స్‌ పరిశ్రమల హబ్‌గా ఏపీ

ABN, Publish Date - Jun 28 , 2025 | 05:30 AM

ఏరోస్పేస్ డిఫెన్స్‌ రంగంలో విస్తృత అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.

  • లక్ష కోట్ల పెట్టుబడి లక్ష ఉద్యోగాలే లక్ష్యం

  • ఉత్తర్వుల్లో పరిశ్రమల శాఖ వెల్లడి

అమరావతి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): ఏరోస్పేస్-డిఫెన్స్‌ రంగంలో విస్తృత అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రా న్ని గ్లోబల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ డిఫెన్స్‌ రిసెర్చ్‌ హబ్‌గా మార్చాలన్న నిర్ణయంతో ఈ రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతూ ఏరోస్పేస్-డిఫెన్స్‌ పాలసీ 2025-30ని శుక్రవారం విడుదల చేసింది. రూ. లక్ష కో ట్లు పెట్టుబడుల సేకరణ.. లక్ష మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ రంగంలో పెట్టే పెట్టుబడులపై 25 నుంచి 45 శాతం వరకూ రాయితీ ఇవ్వాలని, సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల్లో నూ 10 శాతం భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ విభాగాల్లో ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్రాన్ని ఆరు క్లస్టర్లుగా విభజించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏరోస్పేస్‌-డిఫెన్స్‌ పాలసీని అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్‌ మా న్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ డిఫెన్స్‌ రిసెర్చ్‌ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో ఉన్నామ ని పరిశ్రమల శాఖ పేర్కొంది. సింగిల్‌ విండో విఽధానంలో పెట్టుబడులకు క్లియరెన్సులను ఇస్తామని వెల్లడించింది. డిఫెన్స్‌ రంగంలో కొత్త ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ వేదికగా మార్చేందుకు ఈ పాలసీ దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేసింది.

Updated Date - Jun 28 , 2025 | 05:30 AM