AP NGO Association: సమస్యలపై పోరాటానికి ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం
ABN, Publish Date - Aug 04 , 2025 | 04:53 AM
ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్
ఏపీ ఎన్జీవో నేతలు విద్యాసాగర్, డీవీ రమణ
విజయవాడ (బస్టేషన్), ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్‌ఎంయూఏ) చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో సంఘం కలిసి నడుస్తుందని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ అన్నారు. తాడేపల్లిలోని ఏపీఎ్‌సఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి అధ్యక్షతన ఆదివారం కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథి విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రతి సంక్షేమ పథకం అమలులో ఉద్యోగుల పాత్రను ప్రభుత్వం గుర్తించాలన్నారు. పీవీ రమణారెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంపూర్ణంగా సహకరిస్తారన్నారు.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 04 , 2025 | 04:53 AM