AP Govt Guinness Records: ఏపీ ప్రభుత్వం మరో రికార్డు.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్
ABN, Publish Date - Jul 28 , 2025 | 06:33 PM
సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ రికార్డుపై ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో స్పందించారు.
అమరావతి, జులై 28: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. అనంతపురం జిల్లాలో ఇటీవల జరిగిన మెగా పేరెంట్, టీచర్స్ మీటింగ్(PTM)లో సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు విద్య శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ మీటింగ్ ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసుకుంది. ఈ విషయంపై ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ గిన్నిస్ రికార్డును టీచర్లందరికీ అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. 5.34 మిలియన్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ పీటీఏంలో భాగస్వాములయ్యారన్నారు. అలాగే నేరుగా, పరోక్షంగా ఈ పేరెంట్, టీచర్స్ మీటింగ్‌కు కోటిన్నర మంది హాజరయ్యారని వివరించారు.
జాతీయ విద్యా విధానం ఐదో వార్షికోత్సవం జులై 29వ తేదీకి ఒక రోజు ముందు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలు తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ రికార్డు గొప్ప ప్రోత్సాహంగా నిలిచిందని మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. మెగా పీటీఎంను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. ఈ అరుదైన రికార్డు సాధనలో భాగమైన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాగ పంచమి... జస్ట్ ఇలా చేయండి..
‘కాలేజీలు ఖాళీ’ అంటూ ప్రచారం.. మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్
For More AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 28 , 2025 | 08:28 PM