PM Modi Nara Lokesh: ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ
ABN, Publish Date - May 17 , 2025 | 08:07 PM
ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ భేటీ అయింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది.
PM Modi Nara Lokesh: ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ భేటీ అయింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ ప్రధానిని కలిశారు. దాదాపు గంటన్నరపాటు ఈ సమావేశం జరిగింది. అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమం సందర్భంలో కుటుంబ సమేతంగా వచ్చి తనను కలవాలని నారా లోకేష్‌ను ప్రధాని మోదీ కోరిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేష్, బ్రాహ్మణిని కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీ, దేవాన్ష్‌ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని మాట్లాడారు. ఈ భేటీలో రాష్ట్రంలోని పలు అంశాలు వీరిరువురి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
తాబేళ్లు వలస వెళ్తున్నాయట
Updated Date - May 17 , 2025 | 09:41 PM