Share News

Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..

ABN , Publish Date - May 17 , 2025 | 05:15 PM

రోహిత్ శర్మ ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటాడు. అనవసర వివాదాల్లో తలదూర్చడు. అయితే రోహిత్‌ కోపంగా ఉంటే ఎలా ఉంటుందో చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రోహిత్ తన తమ్ముడిని తిడుతున్నాడు.

Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
Rohit Sharma

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ చేసే సమయంలో ఎంత దూకుడుగా ఉంటాడో మిగతా సమయాల్లో అంత కూల్‌గా ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటాడు. అనవసర వివాదాల్లో తలదూర్చడు. అయితే రోహిత్‌ కోపంగా ఉంటే ఎలా ఉంటుందో చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రోహిత్ తన తమ్ముడిని తిడుతున్నాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు రోహిత్ ప్రవర్తన చూసి షాకవుతున్నారు (Rohit Sharma Brother).


ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరుతో శుక్రవారం కొత్త స్టాండ్ ప్రారంభ‌మైన సంగతి తెలిసిందే. టీమిండియాతో పాటు ముంబై క్రికెట్‌కు రోహిత్ అందించిన సేవ‌ల‌కు గానూ ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్‌కు అత‌డి పేరును పెట్టి గౌర‌వించింది. శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సహా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి హాజ‌ర‌య్యాడు (Rohit Sharma Car).


రోహిత్ శర్మ తల్లిదండ్రులు, భార్య రితిక‌, సోద‌రుడు విశాల్ ఈ కార్య‌క్ర‌మానికి హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయి బయటకు వెళ్తున్నప్పుడు రోహిత్ తన కారును చూసి షాకయ్యాడు. ఆ కారుకు ఒకవైపు సొట్టలు పడ్డాయి. వాటిని చూసి ఏం జరిగిందని సోదరుడు విశాల్‌ను రోహిత్ అడిగాడు. అందుకు విశాల్.. కారు రివర్స్ చేసేటప్పుడు జరిగిందని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన రోహిత్.. నీకసలు బుర్ర ఉందా, చూసుకోవాలి కదా అంటూ కోప్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవీ చదవండి:

ఐపీఎల్ రీస్టార్ట్‌కు వాన ముప్పు

నీరజ్ చోప్రాపై మోదీ ప్రశంసలు

కోహ్లీ టెన్త్ మార్క్ షీట్ వైరల్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 17 , 2025 | 05:15 PM