ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi AP Tour: ప్రధాని పర్యటన నేపథ్యంలో నిర్వాహక కమిటీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

ABN, Publish Date - May 17 , 2025 | 06:54 PM

ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో నిర్వాహక కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. జూన్ 21 యోగా డే నాడు ప్రధాని మోదీ విశాఖపట్నంలో

PM Modi AP Tour

PM Modi AP Tour: అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో నిర్వాహక కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. జూన్ 21 యోగా డే నాడు ప్రధాని మోదీ విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఈ నిర్వాహక కమిటీ ఏర్పాటు చేశారు. ఐదుగురు మంత్రులతో కూడిన ఈ కమిటీలో హోమ్, ఆరోగ్య, టూరిజం, సాంఘిక సంక్షేమ, మానవ వనరుల శాఖ మంత్రులుంటారు. కమిటీ కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టి కృష్ణ బాబు వ్యవహరిస్తారు. జూన్ 21న ఏపీలో జరిగే ప్రపంచ యోగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది.

ఇలాఉండగా, విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని చంద్రబాబు సర్కారు పట్టుదలతో ఉంది. యోగా డే ప్రకటించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జూన్‌ 21న యోగా డే కార్యక్రమంలో ఏపీ నుంచి ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనిని చరిత్రలో నిలిపోయేలా చేపట్టాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు. యోగా డే నిర్వహణపై సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

"ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్‌ ‘యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌... వన్‌ హెల్త్‌’. యోగా డే నాడు నిర్వహించే కార్యక్రమం రాష్ట్రంలో యోగ అభ్యాసానికి నాంది పలకాలి. కనీసం రెండు కోట్ల మందికి ఈ కార్యక్రమం చేరాలి. ‘యోగాంధ్ర-2025’ థీమ్‌తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలి. ఈ నెల 21 నుంచి జూన్‌ 21 వరకు ‘యోగా మంత్‌’ పాటించాలి. నెల రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గుర్తిస్తూ సర్టిఫికెట్‌ ఇవ్వాలి. రాష్ట్రంలోని పాఠశాల, కళాశాల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలి" అని సీఎం చంద్రబాబు సూచించారు.

"ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి బీచ్‌ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. యోగా చేసేందుకు 68 ప్రాంతాలు గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో 2,58,948 మంది యోగ సాధనకు అవకాశం కల్పిస్తున్నాం" అని అధికారులు వివరించారు. సీఎం మాట్లాడుతూ, ‘ఆర్కే బీచ్‌ నుంచి శ్రీకాకుళం వరకు... బీచ్‌ పొడవునా అన్ని అనుకూల ప్రాంతాల్లో ప్రజలను ఆహ్వానించండి. ఐదు లక్షల మందితో కార్యక్రమాన్ని నిర్వహించండి’ అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News


ఇంటింటికీ తిరిగి మందులు, రేషన్

Updated Date - May 17 , 2025 | 06:54 PM