Nara Lokesh: మంత్రి లోకేష్‌తో బీజేపీ ఏపీ అధ్యక్షుడు భేటీ
ABN, Publish Date - Jul 09 , 2025 | 09:18 PM
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి నారా లోకేష్‌తో ఆయన నివాసంలో మాధవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గతంలో ఎమ్మెల్సీలుగా పని చేసిన సమయంలో జ్ఞాపకాలను వీరిద్దరు గుర్తు చేసుకున్నారు.
అమరావతి, జులై 09: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ భేటీ అయ్యారు. బుధవారం ఉండవల్లిలోని మంత్రి లోకేష్ నివాసంలో ఆయనతో మాధవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాధవ్‌ను శాలువాతో లోకేష్ ఘనంగా సత్కరించారు. అలాగే గతంలో ప్రతిపక్షంలో ఉండగా.. శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా ప్రజా సమాస్యలపై పోరాడిన సందర్భాలను ఈ సందర్భంగా వీరిద్దరు నెమరేసుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కలిసి పని చేద్దామంటూ పీవీఎన్ మాధవ్‌కు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పిలుపు నిచ్చారు.
బీజేపీ నూతన అధ్యక్షుడుగా మాధవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన ఆయన గతంలో బీజేపీ ఎమ్మెల్సీగా పని చేశారు. ఆయన తండ్రి చలపతిరావు సైతం బీజేపీ ఎమ్మెల్సీగా పని చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె రాజమండ్రి ఎంపీగా ఘన విజయం సాధించారు.
ఓ వైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా.. మరోవైపు ఎంపీగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తు వచ్చారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు గడువు సమీపిస్తుంది. ఈ తరణంలో పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. అందులోభాగంగా పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల ఎన్నికను నిర్వహించారు. తెలంగాణలో మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు
For More Andhrapradesh News and Telugu News..
Updated Date - Jul 09 , 2025 | 09:19 PM