ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Savitha: ఆ సామాజిక వర్గం వారికి బీసీ డి ధృవీకరణ పత్రాలు జారీకి చర్యలు: మంత్రి సవిత

ABN, Publish Date - Jul 06 , 2025 | 07:17 PM

నగరాలు.. సామాజికవర్గానికి కుల ధృవీకరణ పత్రాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు.. మంత్రి సవితను క్యాంపు కార్యాలయంలో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు.

AP BC Welfare Minister S Savitha

అమరావతి, జులై 06: రాష్ట్రవ్యాప్తంగా నగరాలు సామాజికవర్గానికి బీసీ డి కుల ధృ‌వీకరణ పత్రాలు జారీ చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను టీడీపీ బీసీ నగరాల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మరుపిళ్ల తిరుమలేశ్వరరావు సారథ్యంలో ఆ సామాజిక వర్గ నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నగరాలకు బీసీ - డీ కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని జీవో ఉన్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మంత్రి దృష్టికి వారు తీసుకు వెళ్లారు. అయితే కేవలం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంతో పాటు కృష్ణా జిల్లాలో మాత్రమే నగరాలకు బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని ఈ ప్రతినిధి బృందం మంత్రి సవితని కలిసి సోదాహరణగా వివరించింది.

అలాగే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో సైతం ఈ సామాజిక వర్గానికి బీసీ - డీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు అర్హత ఉన్నా ఈ ధృవీకరణ పత్రాలు జారీ చేయక పోవడం వల్ల ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సైతం తమ సామాజిక వర్గం కోల్పోతుందని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా నగరాలకు బీసీ - డీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకోనేందుకు అధికారులతో మాట్లాడతానని వారికి మంత్రి సవిత హామీ ఇచ్చారు.

Also Read:

ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ తెలంగాణ పథకాలు: డిప్యూటీ సీఎం

వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 06 , 2025 | 09:07 PM