ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

DGP Harish Kumar Gupta: అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఫోరెన్సిక్‌

ABN, Publish Date - May 04 , 2025 | 04:48 AM

ఏపీ పోలీసులు, ఫోరెన్సిక్‌ నిపుణులకు 5 నుంచి 10 వరకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమం నిర్వహించనున్నారు. డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

  • శిక్షణను వర్చువల్‌గా ప్రారంభించనున్న డీజీపీ

అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ (ఏఐ) వైపు వేగంగా దూసుకెళ్తున్న ఏపీ పోలీసులు.. రాష్ట్ర ఫోరెన్సిక్‌ విభాగం సేవలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగాచర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 5 నుంచి 10 వరకు రాష్ట్రంలోని 26 జిల్లాల పోలీసు యూనిట్లలో ఫోరెన్సిక్‌ నిపుణులు దర్యాప్తు అధికారులు(ఏఎ్‌సఐ, ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ), ప్రభుత్వాస్పత్రి వైద్యులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా సోమవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఏపీ ఎఫ్‌ఎ్‌సఎల్‌ డైరెక్టర్‌ పాలరాజు(ఐజీ) ఈ వర్క్‌షా్‌పను పర్యవేక్షిస్తారు. గత ఏడాది జూలై నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాల (బీఎన్‌ఎస్‌, బీఎన్‌ఎ్‌సఎస్‌, బీఎ్‌సఏ) ప్రకారం ఫోరెన్సిక్‌ నిపుణులే ఆధారాలు సేకరించాల్సి ఉంది. అందుకు అనుగుణంగా నేరం జరిగిన చోటుకు పోలీసులు ఏ విధంగా రక్షణ కల్పించాలి? వెంట్రుక లాంటి ఆధారాలను సైతం ఎలా సేకరించాలి? వాటిని ఎలా నిల్వ చేయాలి? ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి నివేదికను వారంలోనే ఎలా తెప్పించుకోవాలి? కోర్టుకు తీసుకెళ్లే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం జరుగుతున్న తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి? అనే అంశాలపై వర్క్‌షా్‌పలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ నేరస్తులకు కోర్టుల్లో శిక్షలు పడితేనే నేరాలు తగ్గుతాయన్నారు.


ఆ దిశగా అత్యంత అధునాతన పద్ధతులు అందిపుచ్చుకుని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘మారుతున్న పరిస్థితులు, ఏఐ టూల్స్‌ను సమకూర్చుకొంటున్నాం’ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించి అమరావతిలో రూ.250 కోట్లతో ప్రపంచస్థాయి ఫోరెన్సిక్‌ సేవల కేంద్రం (సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్సీ) 2026 మార్చి నాటికి నిర్మించి పోలీసు శాఖకు అందించబోతున్నారని డీజీపీ తెలిపారు.

Updated Date - May 04 , 2025 | 04:50 AM