ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu Naidu: జీరో కరెప్షన్ ఏపీ లక్ష్యం.. 10 ప్రధాన ప్రజా సమస్యలపై ఫోకస్

ABN, Publish Date - Jun 14 , 2025 | 09:40 PM

ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పష్టం చేశారు. ఎవరు అవినీతికి పాల్పడినా వారిపై తక్షణ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.

Chandrababu Naidu

జీరో కరెప్షన్ ఏపీ (Zero Corruption AP) లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అవినీతిపై యుద్ధం ప్రకటించారు. ఏ శాఖనైనా, ఏ స్థాయి అధికారి అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై తక్షణ విచారణ జరిపించాలన్న ఆయన ఆదేశాలు, పాలనలో పారదర్శకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

10 అంశాలకు ప్రాధాన్యత

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల సంతృప్తి స్థాయిలను పరిశీలించారు. ఐవీఆర్ఎస్, సీఎస్‌డీఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ముఖ్యంగా సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఉద్యోగాల కల్పనపై దృష్టి

వర్క్ ఫ్రమ్ హోమ్, పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణ ద్వారా ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియజేయాలని ముఖ్యమంత్రి కోరారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు, ఆగస్ట్ 15 కల్లా అన్ని సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని స్పష్టం చేశారు.

వికలాంగులు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి

వికలాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి అందించేందుకు మరింత మెరుగ్గా ఆలోచించాలని ముఖ్యమంత్రి సూచించారు. చౌక ధరల దుకాణాలను పెంచడం, నగదు లేదా కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరించాలని ఆయన ఆదేశించారు.

ఉచిత ఇసుక విధానం

ఉచిత ఇసుక విధానం అమలులో ఇసుక లేని ప్రాంతాల్లో సంతృప్తి, ఇసుక ఉన్న ప్రాంతాల్లో అసంతృప్తి ఉన్న విషయంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

ప్రజల అభిప్రాయాలు

ఐవీఆర్‌ఎస్ ద్వారా సేకరించిన అభిప్రాయాల ప్రకారం, పింఛన్ల పంపిణీలో అవినీతి లేదని 85 శాతం మంది, ఇంటిదగ్గరే ఇస్తున్నారని 87.8 శాతం, ఉద్యోగుల ప్రవర్తన బావుందని 83.9 శాతం మంది అభిప్రాయాలను వెల్లడించారు. సీఎస్‌డీఎస్ ఫీల్డ్ సర్వేలో పింఛన్ల పంపిణీలో అవినీతి లేదని 93.9 శాతం, ఇంటిదగ్గరే ఇస్తున్నారని 93.3 శాతం, ఉద్యోగుల ప్రవర్తన బావుందని 73.3 శాతం మంది పేర్కొన్నారు.

ఆస్పత్రి సేవలపై సంతృప్తి

ఆస్పత్రి సేవల్లో క్వాలిటీ చెకప్‌పై 68.4 శాతం, రక్త పరీక్షలపై 55 శాతం, ఉచిత మందుల పంపిణీపై 65.5 శాతం, సిబ్బంది ప్రవర్తనపై 71.3 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.

మున్సిపల్ సేవలపై అభిప్రాయాలు

మున్సిపల్ సేవల్లో రోజూ చెత్త సేకరణపై 68.1 శాతం, 24 గంటల్లో చెత్త డంప్ తరలింపుపై 57 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.

ఏపీఎస్‌ఆర్టీసీ సేవలు

ఏపీఎస్‌ఆర్టీసీలో శుభ్రత, సీటింగ్ విషయంలో 53.4 శాతం, నీటి సౌకర్యం 45.2 శాతం, టాయిలెట్స్‌పై 56 శాతం, బస్సు సమయం-రూట్ వివరాలపై 61.5 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.

రేషన్ సరుకులపై అభిప్రాయాలు

రేషన్ నెలనెలా సరుకులు తీసుకుంటున్నామని 75.1 శాతం, నాణ్యత బావుందని 73.8 శాతం వెల్లడించారు.

ఎరువుల లభ్యత

ఎరువుల లభ్యత ఉందని 60.9 శాతం మంది రైతులు చెప్పారు.

డ్రగ్స్ సమస్య

గంజా, డ్రగ్స్ సంబంధిత సమస్య ఉందని 27.4 శాతం, పోలీసులు స్పందిస్తున్నారని 54.5 శాతం మంది అభిప్రాయాలను తెలిపారు.

మహిళలపై హింస

మహిళలపై హింసకు సంబంధించి, పబ్లిక్ ప్రాంతాల్లో వేధింపులు ఉన్నాయని 27.8 శాతం, పోలీసుల స్పందన బావుందని 59.5 శాతం, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని 56.3 శాతం మంది అభిప్రాయపడ్డారు.

రిజిస్ట్రేషన్ సేవలు

రిజిస్ట్రేషన్ సేవలపై 63.4 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, అవినీతి లేదని 62.3 శాతం మంది అన్నారు.

ఇసుక రిజిస్ట్రేషన్

ఇసుక రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌పై 70.6 శాతం, లభ్యతపై 67.5 శాతం, ధరపై 61.1 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.

ఎలక్ట్రిసిటీ సేవలు

నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతోందని 61.6 శాతం చెప్పారు.

పంచాయతీ సేవలు

ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతోందని 56.7 శాతం వెల్లడించారు.

ఎన్టీఆర్ వైద్య సేవలు

ఎన్టీఆర్ వైద్య సేవలపై అడ్మిషన్లపై 86.2 శాతం, సేవలపై 81.3 శాతం, ఆరోగ్య మిత్ర సాయంపై 82.4 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్రభుత్వ పథకాలు, సేవలపై ప్రజల అభిప్రాయాలు సేకరించడం ద్వారా, అవినీతిని అరికట్టడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..


మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 09:57 PM