Swachh Survekshan Awards: రాష్ట్రానికి ఐదు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు
ABN, Publish Date - Jul 18 , 2025 | 05:23 AM
రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కాయి.
వివిధ కేటగిరీల్లో విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ, రాజమండ్రి కార్పొరేషన్లకు..
రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం
ఢిల్లీ, జూలై 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఐదు మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులతో కలిసి పురపాలక శాఖ మంత్రి నారాయణ అవార్డులను అందుకున్నారు. దేశం మొత్తం మీద 23 కార్పొరేషన్లు అవార్డులు దక్కించుకోగా వాటిలో మూడు ఏపీ నుంచే ఉన్నాయి. పది లక్షల జనాభా దాటిన నగరాల్లో విజయవాడ, 3-10 లక్షల జనాభా కలిగిన పట్టణాల్లో గుంటూరు, 50 వేల నుంచి మూడు లక్షల జనాభా కలిగిన కేటగిరిలో తిరుపతి కార్పొరేషన్ అవార్డులు అందుకున్నాయి. స్వచ్ఛ అవార్డుల్లో ఎప్పుడూ ముందంజలో ఉండే ఇండోర్, సూరత్, నవీ ముంబయి నగరాల సరసన విజయవాడ, గుంటూరు, తిరుపతి కూడా చేరాయి. ఇక మినిస్టీరియల్ అవార్డు స్పెషల్ కేటగిరిలో సఫాయి మిత్ర సురక్షిత నగరాల్లో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) ప్రథమ స్థానంలో నిలిచింది. మినిస్టీరియల్ అవార్డుల్లో రాష్ట్రస్థాయిలో రాజమండ్రి నిలిచింది. ఈ అవార్డులు మున్సిపల్ శాఖ పనితీరుకు నిదర్శనమని మంత్రి నారాయణ అన్నారు. ఇందుకు కృషిచేసిన అధికారులు, పారిశుధ్య సిబ్బందిని అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్
Updated Date - Jul 18 , 2025 | 05:23 AM