ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

ABN, Publish Date - Apr 21 , 2025 | 06:34 PM

10th Class Result: 10వ తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పరీక్షా పత్రాల మూల్యాంకనం, ఆ మార్కులను ఆన్‌లైన్‌లోకి ఎక్కించడం తదితర చర్యలు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఈ పరీక్షల ఫలితాల విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.

విజయవాడ, ఏప్రిల్ 21: పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 23వ తేదీన ఈ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు వెల్లడించారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. అధికారిక వెబ్ సైట్, వాట్సాప్ (మన మిత్ర), లీప్ యాప్‌లలో ఫలితాలు చూసుకోవచ్చని వివరించారు. మార్చి 2025, ఎస్ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలు, ఓపెన్ స్కూల్ పదో తరగతితోపాటు ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. ఆ రోజు ఉదయం 10.00 గంటలకు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఫలితాలను అధికారిక https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్లు, ‘మన మిత్ర’(వాట్సాప్), LEAP మొబైల్ యాప్‌లలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.


ఇక అభ్యర్థులు ఫలితాలను వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని..వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు. అలానే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునన్నారు. LEAP మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్‌ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కలిగించినట్లు వివరించారు.


ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ప్రభుత్వం నిర్వహించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,19,275 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లిష్‌ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 6,49,884 మంది విద్యార్థులు ఫీజుకట్టారు. కానీ వారిలో 6,19,275 మంది పరీక్షలు రాశారు.

ఈ పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష పత్రాల మూల్యాంకనం మొత్తం 26 జిల్లాల్లో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభమై.. ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. ఇక మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసే ప్రక్రియ కూడా ముగిసింది. దీంతో ఫలితాల విడుదలకు ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 21 , 2025 | 06:55 PM