YOGA: నిత్యజీవితంలో యోగా భాగం కావాలి
ABN, Publish Date - May 22 , 2025 | 12:17 AM
ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక అశోక్‌నగర్‌లోని డీఎస్‌ఏ ఇండోర్‌స్టేడియంలో యోగాం ధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ వినోద్‌కుమార్ ప్రారంభించారు. 11వ అంతర్జాతీ య యోగా దినోత్సవం సందర్భంగా యోగా మాసాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించామన్నారు.
- యోగాంధ్ర ప్రారంభోత్సవంలో కలెక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం క్లాక్‌టవర్, మే 21(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక అశోక్‌నగర్‌లోని డీఎస్‌ఏ ఇండోర్‌స్టేడియంలో యోగాం ధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ వినోద్‌కుమార్ ప్రారంభించారు. 11వ అంతర్జాతీ య యోగా దినోత్సవం సందర్భంగా యోగా మాసాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించామన్నారు. ఈనెల 21వ తేదీ నుంచి జూన 21వతేదీ వరకు యోగాంధ్ర మాసోత్సవాలు జరుగుతాయని తెలిపారు. అనంతరం అధికారులు, క్రీడాకారులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోలా, డీఎంహెచఓ ఈబీ దేవి, ఆయుష్ జిల్లా అఽధికారి రామకుమార్, జడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ సలీంభాషా, డీఆర్‌డీఏ పీడీ శైలజ, డీపీఓ నాగరాజు నాయుడు, హార్టికల్చర్ డీడీ రఘునాథ్‌రెడ్డి, డీవీఈఓ వెంకట రమణనాయక్, డీటీడబ్ల్యూఓ రామాంజినే యులు, డీఎండబ్ల్యూఓ రామ సుబ్బారెడ్డి, శాప్ కోచలు అనిల్‌కుమార్, నరేష్‌కుమార్, యోగా కోచలు రాజశేఖర్ రెడ్డి, గురు రాజారావు, కృష్ణవేణి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....
Updated Date - May 22 , 2025 | 12:17 AM