ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ROADS: అధ్వానంగా రోడ్లు

ABN, Publish Date - May 25 , 2025 | 12:01 AM

మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంట గ్రామానికి వెళ్లే దారి గుంతలమయంగా ఉంది. చాలా ఏళ్ల క్రితం నిర్మించడంతో తారురోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. 44వ, 42వ జాతీయరహదారులకు పక్కనే ఉన్న ఈ గ్రామానికి రోడ్డు గుంతల మయంగా ఉంది.

Potholes on the way to Gangalakunta

రాప్తాడు, మే 24(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంట గ్రామానికి వెళ్లే దారి గుంతలమయంగా ఉంది. చాలా ఏళ్ల క్రితం నిర్మించడంతో తారురోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. 44వ, 42వ జాతీయరహదారులకు పక్కనే ఉన్న ఈ గ్రామానికి రోడ్డు గుంతల మయంగా ఉంది. చాలా ఏళ్ల నుంచి తారురోడ్డుకు మరమ్మతులు కూడా చేయలేదు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ చెరువు మరవ సమీపంలో జగనన్న కాలనీ ఏర్పాటైంది. ఇళ్లు మంజూరవడంతో లబ్దిదారులు ఇళ్లు నిర్మించుకున్నారు. కాలనీకి వెళ్లే దారి మట్టి రోడ్డు కావడంతో వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతోంది. రోడ్డుకు మట్టి తోలించి చదును చేస్తే కాలనీకి, పొలాలకు వెళ్లే వారికి సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.

ప్రమాదకరంగా గుంత

రాప్తాడు మండలంలోని బండమీదపల్లి నుంచి వరిమడుగు వెళ్లే దారిలో పిఏబీఆర్‌ కుడి కాలువ సమీపంలో గుంత ప్రమా దకరంగా ఉంది. ఆ దారి గుండా నిత్యం వాహనాలు వెలుతుంటాయి. రాత్రి సమయంలో కూడా ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు వెలుతుంటాయి. రహదారి మద్యలో గుంత ఉండటం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రహదారి మద్యలో ఉన్న గుంత పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 25 , 2025 | 12:01 AM