ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLA: రాప్తాడుకు మార్కెట్‌ యార్డు తెస్తాం

ABN, Publish Date - May 05 , 2025 | 11:48 PM

రాప్తాడు నియోజకవ ర్గానికి త్వరలోనే మార్కెట్‌ యార్డును తీసుకొస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె సోమవారం నగరంలోని క్యాంపు కార్యాలయం లో రాప్తాడు మార్కెట్‌ యార్డు కమిటీ నూతన సభ్యులతో సమావేశం నిర్వహించారు. యార్డు చైర్మన సుధాకర్‌, వైస్‌ చైర్మన కృష్ణయ్యతో పాటు 15మంది డైరెక్టర్లు హాజరయ్యారు. వారు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు.

MLA talking to members of the Market Yard governing body

- ఆటోనగర్‌లో కార్యాలయం : ఎమ్మెల్యే పరిటాల సునీత

అనంతపురం రూరల్‌, మే 5(ఆంధ్రజ్యోతి): రాప్తాడు నియోజకవ ర్గానికి త్వరలోనే మార్కెట్‌ యార్డును తీసుకొస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె సోమవారం నగరంలోని క్యాంపు కార్యాలయం లో రాప్తాడు మార్కెట్‌ యార్డు కమిటీ నూతన సభ్యులతో సమావేశం నిర్వహించారు. యార్డు చైర్మన సుధాకర్‌, వైస్‌ చైర్మన కృష్ణయ్యతో పాటు 15మంది డైరెక్టర్లు హాజరయ్యారు. వారు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రస్తుతం అనం తపురం మార్కెట్‌ యార్డు పరిధిలో పనిచేస్తున్నామని, త్వరలో మన నియోజకవర్గానికి యార్డు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే గొందిరె డ్డిపల్లి వద్ద 50 ఎకరాలు పరిశీలించామన్నారు. అది మంజూరైన వెంటనే అత్యాధునిక సదుపాయాలతో యార్డు ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. నియోజకవర్గ కేంద్రంలో యార్డు కార్యాల యాన్ని ఏర్పాటు చేస్తామని, ఆటోనగర్‌లో స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కమిటీలో సగం మంది మహిళలకు అవకాశం ద క్కిందన్నారు. అలాగే పార్టీ కోసం కష్టపడిన పలువురికి పదవులు వచ్చాయని, మిగిలిన వారందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ అందాలి

అర్హత ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులకు సూచించారు. పథకం అమలుపై సోమవారం నగరం లోని క్యాంపు కార్యాలయంలో తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారు లు, మండల కన్వీనర్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హత ఉన్న ఏఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదన్నారు. కౌలు రైతులకు కూడా పథకం వర్తిస్తుందన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 05 , 2025 | 11:48 PM