ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLA: వైసీపీ ఉనికి కోసమే ‘వెన్నుపోటు’

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:13 AM

వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు కార్యక్ర మం ప్రజల్లో ఆపార్టీ ఉనికి కోసమేనని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ విమర్శించారు. ఆయన బుధవారం ‘మనింటికి మన ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని తలుపుల మండలంలోని సంగటివారిపల్లిలో ప్రారంభించా రు.

MLA visiting Sangatavaripalli

- ఎమ్మెల్యే కందికుంట - ‘మన ఇంటికి మన ఎమ్మెల్యే’ ప్రారంభం

కదిరి, జూన 4(ఆంధ్రజ్యోతి) : వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు కార్యక్ర మం ప్రజల్లో ఆపార్టీ ఉనికి కోసమేనని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ విమర్శించారు. ఆయన బుధవారం ‘మనింటికి మన ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని తలుపుల మండలంలోని సంగటివారిపల్లిలో ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... టీడీపీ ప్రారంభించిన ప థకాలతో వైసీపీ ఉనికి కొల్పోతోందన్నారు. తాజాగా తల్లికి వందనం జూన 12న విడుదల చేయనున్నారని తెలుసుకుని వెన్నుపోటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. రాక్షస పాలనుంచి విముక్తి కోసం గతయేడాది జూన 4న ప్రజలు అద్భుత విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ప్ర జలకు హామీలిచ్చిన విధంగానే సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తున్నా మన్నారు. ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే కొడతారని జగన్మోహనరెడ్డి అన్నా రని, ఆ సవాలును స్వీకరించే మనింటికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో ఇంటింటికెళ్లి సమస్యలు తెలుసుకుని, అక్కడిక్కడే పరిష్కారాలు చూపుతున్నామన్నారు. జగన్మోహనరెడ్డి తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. మద్యం వ్యాపారం, భూకబ్జాలతో ప్రభుత్వానికి వెన్నుపోటు పోడిచారన్నారు. ఆస్తి విషయంలో తల్లి, చెల్లికి వెన్నుపోటు పోడిచారని అన్నారు. బాబాయిపై గొడ్డలి వేటు వేసి, బాధిత కుటుంబానికి వెన్నుపోటు పోడించారన్నారు. కుల, మతాలను రెచ్చగొట్టడమే జగన నైజమన్నారు. ఆయన వడ్డిపల్లి, వేమాలగొంది, కోటా ల, మైరాడా, పెద్దన్నవారిపల్లి, తదితర గ్రామాల్లో పర్యటించి, ప్రతి ఇంటికెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ ముబారక్‌, నాయకులు మేడా శంకర్‌, గరికపల్లి రామక్రిష్ణారెడ్డి, వీరభార్గవ రెడ్డి, రాజారెడ్డి, గంగరాజు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 05 , 2025 | 12:13 AM