ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TEACHERS: ఇంగ్లిష్‌ ఎస్‌ఏ ప్రమోషన్ల కోసం మూడోరోజూ ధర్నా

ABN, Publish Date - Jun 01 , 2025 | 12:57 AM

అర్హులైన సీనియర్‌ టీచర్లకు ఇంగ్లీష్‌ స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలంటూ పలువురు టీచర్లు చేపట్టిన ధర్నా శనివారం మూడో రోజూ కొనసాగింది. బదిలీల ప్రక్రియ జరుగుతున్న నగరంలోని శారదాస్కూల్‌ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బాధిత టీచర్లకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

DEO Prasad Babu talking to protesting teachers

అనంతపురం విద్య, మే 31(ఆంధ్రజ్యోతి): అర్హులైన సీనియర్‌ టీచర్లకు ఇంగ్లీష్‌ స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలంటూ పలువురు టీచర్లు చేపట్టిన ధర్నా శనివారం మూడో రోజూ కొనసాగింది. బదిలీల ప్రక్రియ జరుగుతున్న నగరంలోని శారదాస్కూల్‌ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బాధిత టీచర్లకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా నాయకు లు మాట్లా డుతూ... ఇతర జిల్లాల్లో ఇంగ్లీష్‌ స్కూల్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు ఇచ్చినా..... అనంతపురం జిల్లాలో ఇవ్వకపోవడం దారుణం అన్నారు. గతంలో వందల్లో ఖాళీలు చూపితే ఇప్పుడు కేవలం 19 మాత్రమే ఉన్నాయనడం సరికాదన్నారు. అనంతరం ధర్నా శిబిరం వద్దకు డీఈఓ ప్రసాద్‌బాబు చేరుకుని, ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు, టీచర్లు సూర్యుడు, సురేష్‌, కృష్ణారెడ్డి, సూర్యనారాయణ, లక్ష్మీదేవి, విజయశ్రీ, గాయత్రి, శివప్రసాద్‌, రంగప్ప, శ్రీనివాసులు, ఓబిరెడ్డి, మల్లరాజు, జిలాన, భాస్కర్‌, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 01 , 2025 | 12:57 AM