ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SURVEYORS: సమస్యలు పరిష్కరించాలని సర్వేయర్ల వినతి

ABN, Publish Date - Jun 25 , 2025 | 11:52 PM

తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ సచివాలయ సర్వేయర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మండలంలోని గ్రామ సచివాలయ సర్వేయర్లు బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పిం చారు. జీఓ నెం.1 ప్రకారం హేతుబద్ధీకరణలో భాగంగా మిగులు సిబ్బందిని గ్రామ సర్వేయర్లుగా నివేదిక సమర్పించాలన్నారు.

Village Secretariat Surveyors submitting petition to Tehsildar

ఓబుళదేవరచెరువు, జూన 25(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ సచివాలయ సర్వేయర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మండలంలోని గ్రామ సచివాలయ సర్వేయర్లు బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పిం చారు. జీఓ నెం.1 ప్రకారం హేతుబద్ధీకరణలో భాగంగా మిగులు సిబ్బందిని గ్రామ సర్వేయర్లుగా నివేదిక సమర్పించాలన్నారు. అలాగే జీఓ నెం. 161 ప్రకారం గ్రేడ్‌ -3 నుంచి గ్రేడ్‌ -2గా హోదా కల్పించడంతో పాటు పేస్కేల్‌లో తగిన మార్పు చేయాలన్నారు. అన్ని జిల్లాల్లో సీనియర్ల జాబితాను వెంటనే విడుదల చేయాలన్నారు. అర్హత కలిగినవారికి ఉద్యోగోన్నతి కల్పించాలని, సర్వీస్‌రూల్స్‌లో తగిన మార్పులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సర్వేయర్లు వెంకటేష్‌, బాబ్‌జాన, శ్రీనివాసులు, తదితరులున్నారు.

నల్లచెరువు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్వేయర్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌ రవికుమార్‌కు వారు బుధవా రం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో ఆంధ్రప్రదేశ గ్రామ సర్వేయర్ల నిరసనకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని అన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 25 , 2025 | 11:52 PM