MLA: రేపు గార్లదిన్నెలో శింగనమల మినీ మహానాడు
ABN, Publish Date - May 20 , 2025 | 12:08 AM
శింగనమల నియో జకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని కలిసికట్టుగా విజయవంతం చేద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పి లుపునిచ్చారు. అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహంలో సోమవారం ఎమ్మెల్యేతో పాటు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి కలిసి నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ కన్వీనర్లు, క్లస్టర్ ఇనచార్జ్‌లతో మినీ మహానాడుపై సమా వేశం నిర్వహించారు.
- మర్తాడు క్రాస్ వద్ద టి - కన్వెన్షన హాల్‌లో...
- ఏర్పాట్లపై సమీక్షించిన ఎమ్మెల్యే శ్రావణిశ్రీ
బుక్కరాయసమద్రం/గార్లదిన్నె, మే 19(ఆంధ్రజ్యోతి): శింగనమల నియో జకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని కలిసికట్టుగా విజయవంతం చేద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పి లుపునిచ్చారు. అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహంలో సోమవారం ఎమ్మెల్యేతో పాటు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి కలిసి నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ కన్వీనర్లు, క్లస్టర్ ఇనచార్జ్‌లతో మినీ మహానాడుపై సమా వేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతంతో పాటు, మినీ మ హానాడులో చేపట్టాల్సిన తీర్మానాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ... మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దా మన్నారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళిక, కార్యకర్తల సంక్షేమం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ఆమలు తీరుపై మినీ మహానాడులో తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కార్యకర్తల మృతి పట్ల సంతాపం తెలుపను న్నట్లు తెలిపారు. మినీహానాడును విజయవంతం చేసేందుకు కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్, గ్రామ యూనిట్ ఇనచార్జ్, పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మం డల కన్వీనర్లు అశోక్‌కుమార్, గుత్తా ఆదినారాయణ, బాల రంగయ్య, పాండు, ఎర్రినాగప్ప, రామాంజినేయులు, ఆరు మండలాల క్లస్టర్ ఇనచార్జ్ లు పాల్గొన్నారు. అనంతరం మినీ మహానాడును గార్లదిన్నె మండల పరిధి లోని మర్తాడు క్రాస్ వద్ద నున్న టి - కన్వెన్షన హాల్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు మినీమహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మినీమహానాడు ఏర్పాట్లుకు సంబంధించి సోమవారం ఎమ్మెల్యేతో పాటు ఏడీసీసీ చైర్మన కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు, రామలింగారెడ్డి, పసుపుల శ్రీరామిరెడ్డి, గేట్ క్రిష్ణారెడ్డి తదితర నాయకులు టి - కన్వెన్షన హాల్ వద్ద పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన చంద్రశేఖర్ నాయుడు, నాయకులు పాండు, జయరాం, గుత్తా బాలకృష్ణ, నరసింహారెడ్డి, ఈశ్వరయ్య, గుర్రం శీనా, అంజి, పవన, సుబ్బు, శేఖర్, చల్లా నాగరాజు, గుత్తా హరి, పరశురామ్, దాసరి శీన తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....
Updated Date - May 20 , 2025 | 12:08 AM