ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLA : ప్రజా అవసరాలను తెలుసుకుని సేవలు

ABN, Publish Date - Apr 17 , 2025 | 11:30 PM

ప్రజా అవసరాలను క్షేత్ర స్థాయిలో తెలుసుకుని..వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. స్థానిక లెక్చరర్స్‌ కాలనీలో రూ. 19లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణానికి ఆయన గురువారం భూమి పూజ చేశారు. అక్కడి నుంచి రుద్రంపేటలో నూత నంగా ఏర్పాటు చేసిన 20ట్రాన్సఫార్మర్లను ప్రారంభించారు.

MLA Daggubati performing Bhoomi Puja for the construction of CC Road

- ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

అనంతపురం రూరల్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): ప్రజా అవసరాలను క్షేత్ర స్థాయిలో తెలుసుకుని..వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. స్థానిక లెక్చరర్స్‌ కాలనీలో రూ. 19లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణానికి ఆయన గురువారం భూమి పూజ చేశారు. అక్కడి నుంచి రుద్రంపేటలో నూత నంగా ఏర్పాటు చేసిన 20 ట్రాన్సఫార్మర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... మీ ఇంటికి..మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. రుద్రంపేటలో లో ఓల్టేజీ సమస్య కారణంగా తరచూ విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పాడుతోందని స్థానికులు తన దృష్టికి తెచ్చారన్నారు. అందుకు ఇక్కడ నూతనంగా 30ట్రాన్సఫార్మర్లు మంజూరు చేయించామన్నారు. విద్యుత అధికారులు ఇప్పటి వరకు 20 ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో అర్బన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత శాఖ ఈఈ జేవీ రమేష్‌, డీఈఈ శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ బాలాస్వామి, ఈఈ షాకీర్‌, స్థానిక కార్పొరేటర్‌ లాలు, కార్పొరేషన్ల డైరెక్టర్లు లక్ష్మీ నరసింహులు, మూర్తి, నాయకులు రమేష్‌, దళవాయి వెంకటనారాయణ, సరిపూటి రమణ, రాయల్‌ మధు, రుద్రంపేట పంచాయతీ ఇనచార్జ్‌ భక్తవత్సలం నాయుడు, మారుతి నాయుడు, కుమార్‌ నాయుడు, ఆది, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 17 , 2025 | 11:30 PM