ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

EX MINISTER: రూ. 80 లక్షలతో వడ్డెర్ల కమ్యూనిటీ భవనం

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:23 AM

వడ్డెర సామాజిక వర్గాన్ని ఆర్థికంగా బలో పేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ బీకే పార్థ సారఽథి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. అందులో భా గంగా మండలంలోని వడ్డెర్లకు రూ. 80లక్షలతో కమ్యూనిటీ భవన నిర్మా ణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎంపీ బీకే , మాజీ మంత్రి పల్లె సోమవారం మండలంలోని సున్నంపల్లి పంచాయతీలో పర్యటిం చారు.

-ఎంపీ బీకే, మాజీ మంత్రి పల్లె - స్థల పరిశీలన

ఓబుళదేవరచెరువు, జూన16 (ఆంధ్రజ్యోతి): వడ్డెర సామాజిక వర్గాన్ని ఆర్థికంగా బలో పేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ బీకే పార్థ సారఽథి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. అందులో భా గంగా మండలంలోని వడ్డెర్లకు రూ. 80లక్షలతో కమ్యూనిటీ భవన నిర్మా ణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎంపీ బీకే , మాజీ మంత్రి పల్లె సోమవారం మండలంలోని సున్నంపల్లి పంచాయతీలో పర్యటిం చారు. సర్వే నంబర్‌ 785-1లోని 2.55 ఎకరాల భూమిలో ఎకరా విస్తీర్ణం లో వడ్డెర కమ్యూనిటీ భవనం నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు.

ప్రభుత్వ భూములను కాపాడుతాం

మండలంలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షిస్తామని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మండలంలోని ఎం. కొత్తపల్లి, ఓడీచెరువు, వెంకటాపురం, సున్నంపల్లి, అల్లాపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములున్నాయని, వాటి వివరాలు వెల్లడించారు. ఆ భూములను ప్రభుత్వ భవనాలు, ఆర్‌అండ్‌బీ బంగ్లా, అగ్నిమాపక కేంద్రం నిర్మించేందుకు ఉపయోగిస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. అర్హులైన పేదలలకు ఇంటి పట్టాలతో పాటు ఇళ్లు మంజూరు చేస్తామమన్నారు. అందకు ముందు బీసీ కాలనీలో గుండెపోటుతో మృతిచెందిన టీడీపీ కార్యకర్త రహంతుల్లా కుటుంబాన్ని, అదేకాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న రామాంజనేయులను పరా మర్శించి, ఆర్థికసాయం అందించారు. ఆయనతో పాటు టీడీపీ మండల కన్వీనర్‌ జయచంద్ర, మాజీ జడ్పీసీ పిట్టా ఓబులరెడ్డి, నాయకులు తుమ్మల మహబూబ్‌బాషా, ఆంజ నప్ప, పీట్ల సుధాకర్‌, బోరు రమణ, ఎంపీటీసీ శ్రీనివాసులు, సర్పంచ శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 17 , 2025 | 12:23 AM